Breaking Newsఆదిలాబాద్జిల్లా వార్తలుతెలంగాణవిద్య

Big Alert : విద్యార్థులకు బిగ్ అలర్ట్.. పాఠశాల వేళల మార్పు..!

Big Alert : విద్యార్థులకు బిగ్ అలర్ట్.. పాఠశాల వేళల మార్పు..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

తెలంగాణలోని ఉత్తర జిల్లాలలో చలి తీవ్రత పెరిగింది. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో పొగమంచు, చలి తీవ్రత ఎక్కువగా ఉంది. కొద్దిరోజులుగా జిల్లాలో 6,7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. దాంతో జిల్లా ప్రజలు చలికి వణుకుతున్నారు.

ఇది ఇలా ఉండగా ఉదయమే పాఠశాలకు విద్యార్థులు వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. దాంతో విద్యార్థుల పాఠశాలల సమయంలో మార్పులు చేస్తూ జిల్లా కలెక్టర్ రాజార్షి గురువారం ఆదేశాలు జారీ చేశారు.

పాఠశాల సమయం లో మార్పులు ఇవి :

పాత సమయం : ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4:15 గంటల వరకు.

కొత్త సమయం : ఉదయం 9:40 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు.

ఈ మార్పులు జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు వర్తిస్తాయి. జిల్లాలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఈ ఉత్తర్వులను తక్షణమే అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకోనున్నట్లు
హెచ్చరించారు. ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేటు, ఎయిడెడ్, అన్ని రకాల విద్యాసంస్థలు కూడా మారిన సమయాన్ని పాటించాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.

MOST READ 

  1. Railway : శంకర్‌పల్లి ప్రజలకు శుభవార్త.. రెండు ఎక్స్ ప్రెస్ రైళ్లు నిలుపుదల..!

  2. Sub Collector : ఎన్నికల సామాగ్రి డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రం సందర్శించిన సబ్ కలెక్టర్..! 

  3. ACB : రూ.10వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ కి రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన రెవెన్యూ ఇన్స్పెక్టర్..!

  4. Suryapet : మంత్రి ఉత్తమ్ కు బిగ్ షాక్.. ఉత్తమ్ ఇలాకాలో అతిపెద్ద గ్రామపంచాయతీ బీఆర్ఎస్ కైవసం..!

మరిన్ని వార్తలు