Alert : తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. మూడు రోజులు వర్షాలే..!
Alert : తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. మూడు రోజులు వర్షాలే..!
మన సాక్షి :
తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ప్రకటించింది. మూడు రోజులపాటు వర్షాలు కురువనున్నాయి. శనివారం రెండు తెలుగు రాష్ట్రాలలో అన్ని ప్రాంతాలలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో ఆంధ్ర ప్రదేశ్ లో పలు జిల్లాలలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు.
వర్షాల కారణంగా పాఠశాలలకు సెలవులు ఇవ్వాలని తెలంగాణ వ్యాప్తంగా కూడా విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణలోని పలు జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్, నల్గొండ, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి , ములుగు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది.
నైరుతి రుతుపవనాలు సెప్టెంబర్ నెలాఖరు వరకు కొనసాగే అవకాశం ఉన్నందున సెప్టెంబర్, అక్టోబర్ రెండు మాసాలలో కూడా రెండు తెలుగు రాష్ట్రాలలో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. కాగా మరో రెండు రోజులపాటు ఇవే వర్షాలు కురవనున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
LATEST UPDATE :
TG NEWS : తెలంగాణ కాంగ్రెసులో కోల్డ్ వార్..? ఉత్తమ్ సీఎం అవుతారంటూ రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు..!
ఫ్లాష్ న్యూస్ : సెల్ఫీ దిగుతూ సాగర్ ఎడమ కాలువలో పడిన మహిళ.. కాపాడిన స్థానికులు..!
నిరుద్యోగులకు శుభవార్త.. 2280 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్..!
Nagarjunasagar : నాగార్జునసాగర్ కు భారీ వరద.. 16 గేట్లు ఎత్తిన అధికారులు..!









