Rythu Barosa : రైతు భరోసా యాప్ తో రుణమాఫీ సమస్యలకు చెక్..!
Rythu Barosa : రైతు భరోసా యాప్ తో రుణమాఫీ సమస్యలకు చెక్..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రూపాయల రుణమాఫీ చేశారు. కానీ అనేక మంది రైతులు తమ ఖాతాలలోకి రుణమాఫీ డబ్బు రాలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల రైతుల నుంచి అధికారులు వివరాలను కూడా సేకరించారు.
కాగా రైతు భరోసా యాప్ ను వ్యవసాయ అధికారులు కొత్తగా రూపొందించారు. దీని ద్వారా అర్హులై ఉన్న రైతులకు కూడా రుణమాఫీ అందకపోతే వ్యవసాయ అధికారులు ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. రైతు భరోసా పంట రుణమాఫీ యాప్ తో రైతులకు భరోసా కల్పిస్తున్నారు.
వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో సమాచారం సేకరించి యాప్ లో నమోదు చేస్తున్నారు. వ్యవసాయ అధికారులు ఇంటింటికి వెళ్లి రుణమాఫీ కాని వారి వివరాలు సేకరించి వారి వద్ద నుంచి ధ్రువీకరణ పత్రాన్ని తీసుకుంటున్నారు. దానిపై పంచాయతీ కార్యదర్శి సంతకం కూడా తీసుకుంటున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. రైతుల వివరాలను యాప్ లో నమోదు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రుణమాఫీ కాలేదని రైతులు ఫిర్యాదు చేసిన ఆధారాల ఆధారంగా ఇళ్లకు వెళ్లి కుటుంబ వివరాలను సేకరిస్తున్నారు.
రుణమాఫీ కాని రైతుల ఇంటికి వెళుతున్న అధికారులు రైతు బ్యాంకు ఖాతా, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఇతర పత్రాలను పరిశీలిస్తున్నారు. కుటుంబ వివరాలు తీసుకొని ఫోటోలతో సహా యాప్ లో అప్ లోడ్ చేస్తున్నారు.
వ్యవసాయ అధికారులు రూపొందించిన రైతు భరోసా పంట రుణమాఫీ యాప్ ద్వారా రైతులకు రుణమాఫీ వారి వారి ఖాతాలో పడే అవకాశం ఉంది. ఈ సర్వే అయిపోయి వారం రోజులలో రైతులకు వారి ఖాతాలో డబ్బులు జమ కానున్నట్లు సమాచారం.
LATEST UPDATE :
Runamafi : రుణ మాఫీ కోసం రేషన్ కార్డులేని రైతులు దరఖాస్తు చేసుకోవాలి..!
ఉద్యోగానికి సెలవు.. ప్రైవేట్ ప్రాక్టీస్ లో డాక్టర్.. సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్..!
Praja Palana : తెలంగాణలో మళ్లీ ప్రజా పాలన.. 10 రోజుల పాటు దరఖాస్తుల స్వీకరణ..!
Khammam : రైతు సంఘాల ధర్నాలో మంత్రి తుమ్మల.. రుణమాఫీ పై ఏమన్నారంటే..!










