Breaking Newstravelజాతీయం
Big Alert : వాహనదారులకు బిగ్ అలర్ట్.. ఫాస్టాగ్ పాస్ ధరల పెంపు..!
వాహనదారులకు (ఎన్ హెచ్ ఏ ఐ) నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా భారీ షాక్ ఇచ్చింది. వార్షిక ఫాస్టాగ్ పాస్ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది.

Big Alert : వాహనదారులకు బిగ్ అలర్ట్.. ఫాస్టాగ్ పాస్ ధరల పెంపు..!
మన సాక్షి, వెబ్ డెస్క్:
వాహనదారులకు (ఎన్ హెచ్ ఏ ఐ) నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా భారీ షాక్ ఇచ్చింది. వార్షిక ఫాస్టాగ్ పాస్ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం 3000 రూపాయలుగా ఉన్న వార్షిక పాస్ ధరపై 2.5% మేర పెంచుతున్నట్లు పేర్కొన్నది. అయితే పెంచిన ధర ప్రకారం వార్షిక పాస్ ధర 3075 రూపాయలుగా ఉండనున్నది. ఈ ధర ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్నది.
మార్చి 31వ తేదీలోగా రీఛార్జ్ చేసుకుంటే మాత్రం ప్రస్తుత ధరలే వర్తిస్తాయి. ఫాస్టాగ్ వార్షిక పాస్ తీసుకుంటే దేశవ్యాప్తంగా ఒక సంవత్సరం కాలం పాటు 200 టోల్ ప్లాజాల వద్ద ఆగకుండా ప్రయాణించే వెసులుబాటు కల్పించింది. 2026 ఆగస్టు 15వ తేదీన ఈ ఫాస్ట్ ఆగ్ పాస్ విధానాన్ని తీసుకొచ్చింది. అయితే దీనికి వాహనదారుల నుంచి భారీ స్పందన లభించింది. సుమారు 52 లక్షల మంది ఫాస్టాగ్ పాస్ వినియోగిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి :
- Miryalaguda : మిర్యాలగూడలో ఎన్ ఫోర్స్ మెంట్ బృందం దాడులు.. సిలిండర్ల పట్టివేత..!
- Good News : రైతులకు గుడ్ న్యూస్.. 13న ఖాతాలలో ఆ డబ్బులు జమ..!
- LPG GAS : గ్యాస్ బుకింగ్ సర్వర్ డౌన్.. హాస్టల్స్, హోటల్స్ లో తీవ్ర ఇబ్బందులు..!
- BREAKING : తెలంగాణలో ఘోర ప్రమాదం.. ప్రైవేట్ బస్సు బోల్తా, స్పాట్ లో నలుగురు మృతి..!









