Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణరంగారెడ్డి

BIG BREAKING : ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు బీబీఏ విద్యార్థులు మృతి..!

రోడ్డు ప్రమాదంలో నలుగురు విద్యార్థులు మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా మోకిల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

BIG BREAKING : ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు బీబీఏ విద్యార్థులు మృతి..!

బర్త్ డే పార్టీ.. తిరిగి వెళ్తుండగా తీవ్ర విషాదం

ఇక్ఫాయ్ (ఐబీఎస్) కళాశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు, ఎంజిఐటి కళాశాలకు చెందిన ఒకరు అక్కడికక్కడే మృతి

శంకర్‌పల్లి: జనవరి 08: (మన సాక్షి):

రోడ్డు ప్రమాదంలో నలుగురు విద్యార్థులు మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా మోకిల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శంకర్‌పల్లి మండల పరిధిలోని దొంతానపల్లిలో గల ఇక్ఫాయ్ (ఐబీఎస్) కళాశాలకు చెందిన బిబిఏ మూడో సంవత్సరం చదివే నలుగురు విద్యార్థులు స్పోర్ట్స్ కారులో గురువారం కోకాపేటలోని బర్త్ డే వేడుకలకు వచ్చారు.

పార్టీ అనంతరం వారిని రోహిత్ (ఎంజిఐటి విద్యార్థి) డ్రాప్ చేయడానికి వచ్చి మీర్జాగూడ గేట్ వద్ద అర్ధరాత్రి దాటాక కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో అందులో ఉన్న నలుగురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు గాయపడ్డారు.

మృతులు సూర్యతేజ (20), సుమిత్ (20), నిఖిల్(18), రోహిత్ (20) గుర్తించారు. విద్యార్థిని నక్షత్ర (20) తీవ్రంగా గాయపడగా ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. రోహిత్ వారిని డ్రాప్ చేయడానికి వచ్చి ఉండొచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

MOST READ 

  1. Miryalaguda : మిర్యాలగూడలో అధికార కాంగ్రెస్ కు బిగ్ షాక్.. ఆగని వలసలు.. బీ ఆర్ ఎస్ లో భారీగా చేరికలు..!

  2. Doctorate : మెకానికల్ ఇంజినీరింగ్ విభాగంలో సతీష్ కు ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్..!

  3. TG News : ప్రభుత్వ ఉద్యోగులందరికీ తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన..!

  4. Hyderabad : డయల్–100కు క్షణాల్లో స్పందించిన పోలీసులు.. ఏటీఎం దొంగ అరెస్ట్..!

మరిన్ని వార్తలు