Breaking Newsఆంధ్రప్రదేశ్

Big Breaking : ఆంధ్రప్రదేశ్ లో భారీ పేలుడు.. 21 మంది మృతి..!

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర సంఘటన చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలో బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి 20 మంది మృతి చెందారు. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం లో శనివారం మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించింది.

Big Breaking : ఆంధ్రప్రదేశ్ లో భారీ పేలుడు.. 21 మంది మృతి..!

మన సాక్షి, వెబ్ డెస్క్:

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర సంఘటన చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలో బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి 20 మంది మృతి చెందారు. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం లో శనివారం మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించింది. బాణాసంచా తయారీలో ఒక్కసారిగా మంటలు చలరేగి భారీ శబ్దంతో పేలుళ్లు సంభవించింది. సుమారు 5 కిలోమీటర్ల మేర వేలు ఉన్న శబ్దం వినిపించడంతో సమీప గ్రామాల ప్రజలు కూడా ఆందోళనకు గురయ్యారు.

ఈ పేలుడులో ప్రమాదంలో 21 మంది కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా చిత్రమయ్యాయి. మరో 10 మందికి పైగా కార్మికులు తీవ్ర గాయాలతో పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తుంది. గాయపడిన వారిని చికిత్స కోసం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలు ఉన్నట్లు సమాచార

సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన వివరాలను సేకరిస్తున్నారు. ఈ సంఘటనతో వేట్లపాలెం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ సంఘటనపై ఆరా తీశారు. అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకుని సంఘటన స్థలానికి వెళ్లాలని హోం మంత్రిని ఆదేశించారు. ఈ దుర్ఘటనలో పలువురు సజీవ దహనం కాగా మరికొందరు మంటల్లో చిక్కుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు.

మరిన్ని వార్తలు