Ration Card| రేషన్ కార్డు ఉన్నవారికి భారీ గుడ్ న్యూస్.. షాపుకు వెళ్లాల్సిన పనిలేదు..!

Ration Card| రేషన్ కార్డు ఉన్నవారికి భారీ గుడ్ న్యూస్.. షాపుకు వెళ్లాల్సిన పనిలేదు..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు భారీ గుడ్ న్యూస్ తెలియజేసింది. ఇక రేషన్ షాప్ కు వెళ్లి వివరాలు అడగవలసిన అవసరం లేదు. రేషన్ షాప్ కు సంబంధించిన వివరాలు అన్నీ తెలుసుకోవడానికి ప్రభుత్వం యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
రేషన్ కార్డు యాక్టివ్ లో ఉందా..? లేదా..? ఇప్పటివరకు ఎన్నిసార్లు తీసుకున్నారు..? అనే వివరాలన్నీ కూడా యాప్ ద్వారా తెలుసుకోవచ్చును. అయితే ఈ సేవలు అన్ని ఇంటి నుంచి పొందేలా తీసుకొచ్చారు. టి రేషన్ యాప్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది.ఈ యాప్ లో రేషన్ కార్డుదారులు తమ సమాచారం మొత్తం చూడవచ్చును.
ఈ యాప్ ద్వారా లాభమేంటి..?
టీ రేషన్ యాప్ లో మీ రేషన్ వివరాలను చెక్ చేసుకోవచ్చును. రేషన్ షాప్ లో మీ కోట వివరాలతో పాటు మీరు ఎంత రేషన్ తీసుకున్నారనే వివరాలు కూడా చూడవచ్చును. మీకు కేటాయించిన రేషన్ డీలర్, షాప్ నెంబర్, షాప్ లోకేషన్ కూడా తెలుసుకోవచ్చును. మీ కుటుంబానికి ప్రతినెల ఎంతవరకు బియ్యం, గోధుమలు, ఇతర సరుకులు అందుతాయనేది విషయం కూడా చెక్ చేసుకోవచ్చును. ప్రభుత్వం మీకు ఎంత కేటాయించింది. మీరు ఎంత అందుకున్నారు. అనే వివరాలు కూడా యాప్ లో తెలుసుకోవచ్చును.
రేషన్ కార్డులో మీ కుటుంబ సభ్యుల వివరాలు తనిఖీ చేసుకోవడంతో పాటు ఎవరి ఆధార్ కార్డుతో లింక్ అయినదనే విషయం కూడా తెలుసుకోవచ్చును. రేషన్ షాప్ కు వెళ్లకుండానే సులువుగా ఈ విషయాలను చూసుకునేందుకు యాప్ ను అందుబాటులోకి పౌరసరఫరాల శాఖ తీసుకొచ్చింది.
యాప్ ఎలా వాడాలి..?
టి రేషన్ యాప్ ను ఏ విధంగా వాడాలంటే గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్లి టి రేషన్ అని సెర్చ్ చేయాలి. ఆ తర్వాత యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. యాప్ ఓపెన్ అయ్యాక రేషన్ కార్డు నెంబరు కానీ లేదా ఆధార్ నెంబర్ కానీ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత స్టాక్ రిపోర్ట్, కేటాయింపు అని ఆప్షన్లు కనిపిస్తాయి. వాటిని క్లిక్ చేసి మీరు రేషన్ వివరాలను తెలుసుకోవచ్చును.









