తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

Miryalaguda : కోళ్లకు బర్డ్ ఫ్లూ.. తనిఖీ చేసిన పశుసంవర్ధక శాఖ అధికారులు..!

Miryalaguda : కోళ్లకు బర్డ్ ఫ్లూ.. తనిఖీ చేసిన పశుసంవర్ధక శాఖ అధికారులు..!

మన సాక్షి, మిర్యాలగూడ :

కోళ్లకు బర్డ్ ఫ్లూ వైరస్ నేపథ్యంలో నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలోని పలు గ్రామాలలో కోళ్ల ఫారాలను పశుసంవర్ధక శాఖ అధికారులు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మండలంలోని అవంతిపురం, సుబ్బారెడ్డి గూడెం, రాయల్ పాలెం గ్రామాలలో ఉన్న కోళ్ల ఫారాలను తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా పశుసంవర్ధక శాఖ అధికారిని దుర్గా రమాదేవి మాట్లాడుతూ బర్డ్ ఫ్లూ కారణంగా కొన్ని రాష్ట్రాలలో కోళ్లు అధికంగా చనిపోతున్నాయి అన్నారు. ఈ వైరస్ ముఖ్యంగా వలస పక్షుల వలన వస్తుందన్నారు. అయితే కోళ్లు వైరస్ ప్రభావం వలన చనిపోతే వాటిని పూడ్చి పెట్టాలని తెలిపారు.

లేదంటే ఈ వ్యాధి విస్తృతంగా వ్యాపిస్తుందని పేర్కొన్నారు. అయితే ఎక్కువ ఉష్ణోగ్రత వల్ల ఈ వ్యాధి సంక్రమించదని, పూర్తిగా ఉడికించిన గుడ్లు, 100 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ఉడికించిన మాంసం తింటే ఎలాంటి అనారోగ్యం రాదని ఆమె పేర్కొన్నారు.

■ MOST READ : 

  1. Miryalaguda : రైల్వే స్టేషన్ లో దక్షిణ మధ్య రైల్వే జీఎం ఆకస్మిక తనిఖీ.. సిబ్బందికి సూచనలు..!

  2. Gold Price : భారీగా దిగివచ్చిన బంగారం.. ఇదే గోల్డెన్ ఛాన్స్.. లేటెస్ట్ అప్డేట్..!

  3. Nalgonda : అక్రమ ఇసుక రవాణాపై జిల్లా ఎస్పీ సంచలన నిర్ణయం.. డయల్ 100 కు చేయండి..!

  4. Gold Price : రికార్డ్ స్థాయిలో రూ.8700 పెరిగిన గోల్డ్ రేట్.. తెలుగు రాష్ట్రాల్లో నేటి ధరలు..!

  5. Rythu Bharosa : రైతు భరోసా డబ్బులు ఖాతాలలో జమ కాలేదా.. అయితే ఇలా చేయండి..!

మరిన్ని వార్తలు