Breaking NewsTOP STORIESరాజకీయంవ్యవసాయం

TG News : రైతుబంధు కంటే బోనస్ బాగుందంటున్నారు.. మంత్రి తుమ్మల మరోసారి సంచలన వ్యాఖ్యల వెనుక..!

TG News : రైతుబంధు కంటే బోనస్ బాగుందంటున్నారు.. మంత్రి తుమ్మల మరోసారి సంచలన వ్యాఖ్యల వెనుక..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

రైతు భరోసా పై తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. రైతులకు ఏది మేలు అనుకుంటే అదే అమలు చేస్తామని ఆయన ప్రకటించారు. పదవులు ఓట్ల కోసం మేము పనిచేయడం లేదని రైతులకు మేలు చేసే అంశంపై ఆలోచిస్తామన్నారు.

రైతు బంధు కంటే బోనస్ బాగుందని రైతులు అంటున్నట్లు ఆయన తెలిపారు. బోనస్ వల్ల 15 వేల రూపాయలు వస్తున్నాయని రైతుల పేర్కొంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. రైతులకు ఏది మేలు చేకొరితే దానిని అమలు చేస్తామని చెప్పారు.

తుమ్మల వ్యాఖ్యల పట్ల రైతులు అయోమయంలో ఉన్నారు. బోనస్ బాగుందని రైతులు చెబుతున్నారంటే రైతు భరోసా నిలిపిస్తారా..? అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.రుణమాఫీ, రైతు భరోసా అవసరం లేకుండా రైతులు ఆదాయం వచ్చే పంటలు వేయాలని ఆయన పేర్కొన్నారు. వారికి రైతుబంధు, రుణమాఫీ అవసరం పడకూడదని తుమ్మల వ్యాఖ్యలు చేశారు. రైతు కంటే ప్రభుత్వానికి ఎక్కువ బాధలు ఉన్నాయని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.

ఎన్నికల సమయంలో రైతు భరోసా తో పాటు బోనస్ కూడా ఇస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని రైతులు గుర్తు చేస్తున్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు