Breaking :హోలీ సంబరాల్లో అపశృతి.. చెరువులో పడి బాలుడి మృతి..!
రంగుల పండుగ హోలీ ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. స్నేహితులతో కలిసి పండుగ జరుపుకుంటానని వెళ్లిన ఆ బాలుడు..తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో ఆర్మూర్ పట్టణ కేంద్రంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

Breaking :హోలీ సంబరాల్లో అపశృతి.. చెరువులో పడి బాలుడి మృతి..!
ఆర్మూర్, మన సాక్షి:
రంగుల పండుగ హోలీ ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. స్నేహితులతో కలిసి పండుగ జరుపుకుంటానని వెళ్లిన ఆ బాలుడు.. తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో ఆర్మూర్ పట్టణ కేంద్రంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
ఆర్మూర్ పట్టణానికి చెందిన బొగడమేది హర్షిత్(15) అనే బాలుడు హోలీ పండుగ సందర్భంగా తన స్నేహితులతో కలిసి రంగులు ఆడుకుంటానని తల్లిదండ్రులకు చెప్పి ఉత్సాహంగా ఇంటి నుండి బయటకు వెళ్లాడు. ఆడుకుంటున్న క్రమంలో స్థానిక గుండ్ల చెరువు వద్దకు చేరుకున్న హర్షిత్ ప్రమాదవశాత్తు కాలుజారి లోతైన నీటిలో పడిపోయాడు. గమనించే లోపే నీట మునిగి ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందాడు.
మృతుడి తండ్రి నరేష్ ఒక ప్రైవేట్ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. వారికి ఇద్దరు కుమారులు అందులో పెద్ద కుమారుడు హర్షిత్ మృతి చెందడంతో కుటుంబీకులు బోరుణ విలపిస్తున్నారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు విగతజీవిగా పడి ఉండటాన్ని చూసి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందడంతో వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
రెస్క్యూ టీం సహాయంతో గాలింపు చేపట్టి మృతదేహాన్ని చెరువులో నుండి బయటకు తీయించారు.ఈ ప్రమాదానికి సంబంధించి ఎటువంటి అనుమానాలు లేవని,కేవలం కాలుజారి పడటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని మృతుడి తండ్రి భోజన్న స్పష్టం చేసినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తదుపరి చర్యలు చేపట్టారు.
MOST READ :
- Miryalaguda : మిర్యాలగూడలో హోళీ వేడుకలు.. పాల్గొన్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ..!
- Breaking News : టాప్ 10.. మనసాక్షి ఫ్లా ష్ న్యూస్..!
- District Collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. ప్రజావాణి పిర్యాదులపై సత్వరమే చర్యలు తీసుకొవాలి..!
- TG : వ్యవసాయ రంగంలో సరికొత్త విప్లవం.. రైతులకు అదిరిపోయే గుడ్ న్యూస్..!









