BREAKING : జీవన్ రెడ్డి నివాసానికి టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్..!
మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జీవన్ రెడ్డి నివాసానికి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వెళ్లారు.

BREAKING : జీవన్ రెడ్డి నివాసానికి టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జీవన్ రెడ్డి నివాసానికి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వెళ్లారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన జీవన్ రెడ్డి బుజ్జగించేందుకు ఆయన వెళ్లారు. అయితే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకునేందుకు కూడా జీవన్ రెడ్డి నిరాకరించినట్లు తెలుస్తోంది. ప్లీజ్ నాకు చేసిన అన్యాయం చాలు.. కాంగ్రెస్ కండువా కప్పుకోలేను అని ఆయన పేర్కొన్నారు. టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో పాటు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఏఐసిసి కార్యదర్శి సచిన్ సావంత్ వెళ్లి బుజ్జగింపులు చేశారు. అయినా కూడా జీవన్ రెడ్డి తగ్గలేదని తెలుస్తోంది.
ప్లీజ్ నాకు చేసిన అన్యాయం చాలు.. కాంగ్రెస్ కండువా కప్పుకోలేను!
కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు నిరాకరించిన జీవన్ రెడ్డి
జగిత్యాలలో జీవన్ రెడ్డికి కొనసాగుతున్న బుజ్జగింపు చర్యలు
జీవన్ రెడ్డి నివాసానికి చేరుకున్న టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఆది శ్రీనివాస్, ఏఐసీసీ… pic.twitter.com/XveHMT9E8R
— Telugu Scribe (@TeluguScribe) March 24, 2026









