Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలునల్గొండ

BREAKING : డ్రైనేజ్ సమస్య.. సత్వరమే పరిష్కారం..!

చింతపల్లి మండల పరిధిలోని మేజర్ గ్రామపంచాయతీ అయిన గొడకొండ్ల గ్రామం వీటి నగర్ లో రాష్ట్రీయ రహదారి వెంట సరియైన డ్రైనేజ్ లేకపోవడంతో గ్రామ ప్రజలు తీవ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

BREAKING : డ్రైనేజ్ సమస్య.. సత్వరమే పరిష్కారం..!

చింతపల్లి, మన సాక్షి.:

చింతపల్లి మండల పరిధిలోని మేజర్ గ్రామపంచాయతీ అయిన గొడకొండ్ల గ్రామం వీటి నగర్ లో రాష్ట్రీయ రహదారి వెంట సరియైన డ్రైనేజ్ లేకపోవడంతో గ్రామ ప్రజలు తీవ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో ఐదు కోట్ల వ్యాయామంతో ఇరువైపులా డ్రైనేజీ పనులు పూర్తి చేసేందుకు పనులను మంజూరు చేసింది. కొంత మేరకు ఒక్క సైడు మాత్రమే డ్రైనేజీ పండ్లు చేసి మధ్యలో వదిలేశారు. సదరు కాంట్రాక్టర్కు మంజూరు చేసిన నిధులు సాంక్షన్ కాకపోవడంతో ఆ డ్రైనేజీ పనులు మధ్యలోనే నిలిపివేశారు.

దీంతో అభివృద్ధికి నోచుకోని డ్రైనేజీ తో ప్రతినిత్యం గ్రామ ప్రజలు సమస్య ను ఎదురు కావాల్సిన పరిస్థితి నెలకొంది. రెండు సంవత్సరాల వరకు ప్రత్యేక అధికారుల పాలన కొనసాగినప్పటికీ ఏమాత్రం డ్రైనేజీ సమస్యలు పట్టించుకునే నాధుడు లేకపోయాడు. ప్రస్తుతం నూతన సర్పంచ్ కి డ్రైనేజ్ సమస్య పెద్ద తలనొప్పిగా మారింది.

అయినప్పటికీ ప్రజా సమస్యలే లక్ష్యంగా గొడకొండ్ల సర్పంచ్ కాశగోని వెంకటయ్య ముందుకు వెళ్తూ ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు దగ్గరుండి పనులు చేయిస్తున్నారు. మేజర్ గ్రామపంచాయతీ అయినప్పటికీ ప్రభుత్వం సరైన నిధులు మంజూరు చేయకపోవడంతో సర్పంచ్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇకనైనా జిల్లా అధికారులు స్పందించి గతంలో మంజూరైన డ్రైనేజ్ నిధులను తిరిగి సాంక్షన్ చేయించినట్లయితే ట్రైన్ ఈ సమస్య కొంత మెరుగు పడుతుందని గ్రామ ప్రజలు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు