తెలంగాణBreaking Newsజిల్లా వార్తలురాజకీయంసూర్యాపేట జిల్లా

Suryapet : బీఆర్ఎస్ ఫినిక్స్ పక్షి అంట.. మరి రేవంత్ రెడ్డి జాక్‌పాట్ అంట.. కేటీఆర్ సారూ ఇలా అనబట్టే..!

Suryapet : బీఆర్ఎస్ ఫినిక్స్ పక్షి అంట.. మరి రేవంత్ రెడ్డి జాక్‌పాట్ అంట.. కేటీఆర్ సారూ ఇలా అనబట్టే..!

సూర్యాపేట, మనసాక్షి :

ఓటమి తరువాత మళ్లీ ఫీనిక్స్ పక్షి లా బీఆర్ఎస్ పార్టీ మళ్లీ బలపడిందని బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. గురువారం ఆయన సూర్యాపేట లో బీఆర్ఎస్ రజితోత్సవ ఉత్సవాల ఏర్పాట్లపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తో కలిసి పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయనకు బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ లోకి నిన్న, మొన్న వచ్చిన రేవంత్ రెడ్డి అదృష్టం బాగుండి ఓ జాక్‌పాట్ సీఎం అయ్యారని అన్నారు. రేవంత్ రెడ్డి జాక్‌పాట్‌ లో రాష్ట్రానికి సీఎం అయ్యారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

సూర్యాపేటలో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి తో కేటీఆర్

 

తెలుగు వాళ్లకు ప్రత్యేక గుర్తింపు ఉందని చెప్పిన మహనీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి అస్తిత్వం ఉందని చాటి చెప్పింది కేసీఆర్ అని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ధైర్యంగా పార్టీ పెట్టిన ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ అని పేర్కొన్నారు. శూన్యం నుంచి సునామీ సృష్టించి తెలంగాణ సాధించిన ఘనుడు ఆయనొక్కడేనని అన్నారు.

కేసీఆరే లేకపోతే ప్రత్యేక రాష్ట్రమే లేదని కామెంట్ చేశారు. చావు అంచుల దాకా వెళ్లి తెలంగాణను సాధించి, దేశంలోనే రాష్ట్రాన్ని నెంబర్‌వన్‌గా నిలిపారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ పార్టీకి ఉద్యమాలు, ప్రతిపక్ష పాత్ర కొత్తేమి కాదనే విషయాన్ని అధికార పార్టీ నాయకులు గుర్తు పెట్టుకోవాలని అన్నారు.

బీఆర్ఎస్ రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి రావడం చారిత్రక అవసరమని తెలిపారు. రేవంత్ రెడ్డి ఢిల్లీ కి మూటలు పంపి పదవిని కాపాడుకోవడమే ఆయనకు పనిగా మారిందని కేటీఆర్ ధ్వజమెత్తారు.

MOST READ : 

  1. Rythu Bharosa : రైతు భరోసా పై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన.. బిగ్ అప్డేట్..!

  2. TG News : మహిళలకు తులం బంగారం.. నెలకు రూ.2500లపై బిగ్ అప్డేట్..!

  3. District collector : మఖాన సాగు పై రైతులు దృష్టి సారించాలి.. వ్యవసాయ శాస్త్రవేత్తలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్..!

  4. TG News : నిరుద్యోగ యువతకు అదిరిపోయే పథకం.. రూ.3 లక్షల సహాయం.. నేటి నుంచే..!

  5. UPI : డిజిటల్ పేమెంట్స్ లో మోసాలకు చెక్..!

మరిన్ని వార్తలు