Rythu Bharosa : రైతు భరోసా పై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన.. బిగ్ అప్డేట్..!
Rythu Bharosa : రైతు భరోసా పై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన.. బిగ్ అప్డేట్..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రైతు భరోసా పథకం కొనసాగుతోంది. ఇప్పటివరకు మూడు ఎకరాల లోపు రైతులకు వారి వారి ఖాతాలలో పంట సహాయం జమ అయ్యింది. కాగా మిగతా రైతులు రైతు భరోసా కోసం ఎదురుచూస్తున్నారు. దాంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా మంగళవారం కీలక ప్రకటన చేశారు.
రైతు భరోసా నిధులు అందరి రైతులకు ఉగాది కానుకగా వారి బ్యాంకు ఖాతాలలో జమ చేస్తామని స్పష్టం చేశారు. మార్చి 31 లోపు అందరి ఖాతాలలో జమ చేయమన్నారు. గత ప్రభుత్వం రైతులకు ఇవ్వాల్సినవి కేవలం ఎన్నికల సమయంలో ఇచ్చేవారని విమర్శించారు.
రైతు భరోసా నిధులు అందజేసే సమయంలో ఎన్నికల కోడ్ అడ్డంకిగా చూపడం వల్ల ఆలస్యమైందన్నారు. గత ప్రభుత్వం రైతుబంధు పేరుతో ఎకరానికి 10000 రూపాయలు అందజేయగా తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా ద్వారా ఎకరానికి 12,000 రూపాయలను అందజేస్తున్నట్లు సీఎం వెల్లడించారు.
అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు నెల్లోనే నెలలోనే 7625 కోట్ల రూపాయలను రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలలో జమ చేసినట్లు చెప్పారు. అదేవిధంగా తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పది నెలల్లోనే 20వేల 617 కోట్ల రూపాయల రుణమాఫీ అమలు చేశామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
పంటలు సాగు చేసే రైతులకు రైతు భరోసా పథకంతో పాటు భూమిలేని వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసాను అందజేస్తున్నట్లు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
MOST READ :
-
Suryapet : సూర్యాపేట జిల్లాలో అధికారుల నిర్వాకం.. బతికుండగానే అధికారులే చంపేశారు..!
-
Mobile : నీ పక్కన ఫోన్ మాట్లాడే వాళ్లు ఎవరితో మాట్లాడుతున్నారో.. తెలుసుకోవాలా, చాలా ఈజీ.. ఇలా చేయండి..!
-
PhonePe Free Gas : ఫోన్ పే వాడేవారికి గుడ్ న్యూస్.. ఉచిత గ్యాస్ సిలిండర్ ఇలా పొందండి..!
-
TG News : ఆరోగ్యశ్రీ నిబంధనల్లో మార్పు.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..!









