Breaking Newsక్రైంజిల్లా వార్తలువికారాబాద్ జిల్లా

అనధికారంగా ఉన్న తుపాకీ స్వాధీనం, వ్యక్తిపై కేసు నమోదు..!

వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల పోలీస్ స్టేషన్ పరిధిలోని అనంతసాగర్ గ్రామానికి చెందిన మాదాసు అనంతరాములు వద్ద అనధికారంగా దేశి తుపాకీ ( కంట్రీ మేడ్ విపన్) ఉన్నట్లు విశ్వాసనీయ సమాచారం పై కుల్కచర్ల పోలీస్ సిబ్బంది చట్టపరమైన విధానాన్ని అనుసరించి అతని నివాసంలో శోధన నిర్వహించగా అనుమతి లేకుండా కలిగి ఉన్న దేశి తుపాకీ స్వాధీనం చేసుకున్నారు.

అనధికారంగా ఉన్న తుపాకీ స్వాధీనం, వ్యక్తిపై కేసు నమోదు..!

కుల్కచర్ల, మన సాక్షి:

వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల పోలీస్ స్టేషన్ పరిధిలోని అనంతసాగర్ గ్రామానికి చెందిన మాదాసు అనంతరాములు వద్ద అనధికారంగా దేశి తుపాకీ ( కంట్రీ మేడ్ విపన్) ఉన్నట్లు విశ్వాసనీయ సమాచారం పై కుల్కచర్ల పోలీస్ సిబ్బంది చట్టపరమైన విధానాన్ని అనుసరించి అతని నివాసంలో శోధన నిర్వహించగా అనుమతి లేకుండా కలిగి ఉన్న దేశి తుపాకీ స్వాధీనం చేసుకున్నారు.

ఆయుధం కొంతకాలంగా అడవి పందుల వేటకు ఉపయోగించినట్లు విచారణలో వెళ్లడయింది. ఈ విషయమై సంబంధించిన చట్టాల ప్రకారంగా కేసు నమోదు చేసి, నిందితుడిని న్యాయస్థానానికి హాజరపరచగా న్యాయస్థానం అయినను రిమాండ్ కు తరలించడం జరిగిందని కుల్కచర్ల స్థానిక ఎస్సై రమేష్ కుమార్ తెలిపారు. అలాగే జిల్లా మెజిస్ట్రేట్ అనుమతి లేకుండా ఎవరు ఎలాంటి తుపాకులను లేదా ఆయుధాలను కలిగి ఉండకూడదని హెచ్చరించారు.

అనుమతి లేకుండా ఆయుధాలు కలిగి ఉన్నట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. దేశి తుపాకులు వంటి అణాధికార ఆయుధాల వలన మానవులకే కాకుండా జంతువులు కూడా ప్రాణహాన్ని కలిగించే ప్రమాదకరమైనవి. సరియైన శిక్షణ అనుమతి, చట్టపరమైన అవగాహన లేకుండా ఆయుధాలు వినియోగించారని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు