Rythu Bharosa : రైతు భరోసా కు సీలింగ్.. మీరు అర్హులేనా, లేటెస్ట్ అప్డేట్..!
Rythu Bharosa : రైతు భరోసా కు సీలింగ్.. మీరు అర్హులేనా, లేటెస్ట్ అప్డేట్..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణ రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది. సంక్రాంతి పండుగకు రైతు భరోసా డబ్బులను రైతుల ఖాతాలలో జమ చేయాలని నిర్ణయించింది. అందుకు గాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ వహించి చర్యలు చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతు భరోసా ద్వారా ఎకరానికి 15 వేల రూపాయలు పెట్టుబడి సహాయం అందజేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.
కాగా అధికారంలోకి వచ్చి ఏడాది కాలం గడుస్తున్న రైతు భరోసా పథకాన్ని ప్రారంభించలేదు. రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో రైతు భరోసా పై కీలక ప్రకటన చేశారు. సంక్రాంతికి రైతు భరోసా అందజేస్తామని స్పష్టంగా తెలిపారు.
గత ప్రభుత్వ హయాంలో ఉన్న రైతు బంధు పథకం ద్వారా అక్రమాలు, అవినీతి చోటు చేసుకున్నాయని పేర్కొన్నారు. కాగా రైతుబంధు పథకంలోని లోపాలను సరిదిద్దేందుకు మంత్రిమండలి ఉప సంఘం ఏర్పాటు చేశారు. దాంతో పాటు రైతుల అభిప్రాయ సేకరణ కూడా చేపట్టారు.
ఇదిలా ఉండగా తాజాగా రైతు భరోసా అమలు చేసేందుకు విధివిధానాలను ఖరారు చేసినట్లు సమాచారం. ఈ విషయంపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అభిప్రాయాలతో పాటు జిల్లా, మండల స్థాయి ప్రజాప్రతినిధులు, నాయకుల అభిప్రాయాలు కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. రైతు భరోసా పథకం పరిశ్రమల భూములకు కట్ చేయడంతో పాటు భూస్వాముల భూములకు కూడా కట్ చేయనున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా రైతు భరోసా కు సీలింగ్ విధించాలని నిర్ణయించినట్లు సమాచారం. నిజమైన రైతుల రైతు భరోసా అందజేస్తే వారికి ఉపయోగకరంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తుంది. దాంతో 10 ఎకరాల వరకు రైతు భరోసా పెట్టుబడి సహాయం అందించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. 10 ఎకరాల వరకు ఉన్న రైతులు మాత్రమే సొంతంగా వ్యవసాయం చేసుకుంటారని, అంతకంటే ఎక్కువ ఉన్నవారు పెట్టుబడి పెట్టుకునే స్థాయిలోనే ఉంటారని ప్రభుత్వం భావిస్తుంది. అందుకుగాను 10 ఎకరాలను సీలింగ్ నిర్ణయించినట్లు సమాచారం.
దాంతో పాటు ఐటి చెల్లించేవారు, ప్రభుత్వ ఉద్యోగులు, భూస్వాములను రైతు భరోసా కు అనర్హులుగా తేల్చే అవకాశం ఉంది. పూర్తి వివరాలను సేకరించినట్లు సమాచారం. సంక్రాంతి పండుగకు రైతు భరోసా ద్వారా ఎకరానికి ఒక విడుద 7500 రూపాయలను రైతుల ఖాతాలలో జమ చేయనున్నారు. ఈ విషయంపై ఈ నెల 30వ తేదీన మంత్రిమండలి సమావేశంలో ఫైనల్ నిర్ణయం తీసుకోనున్నారు.
MOST READ :
-
PM Kisan : ప్రధానమంత్రి కిసాన్ యోజనకు దరఖాస్తులు.. మీసేవ కేంద్రాల్లో రైతులు దరఖాస్తు చేసుకోవాలి..!
-
New Scheme : తెలంగాణ మహిళలకు అదిరిపోయే పథకం.. ప్రతి మహిళకు 10 లక్షలు.. వివరాలు ఇవే..!
-
Elections : గ్రామపంచాయతీ ఎన్నికలకు రెడీ.. అప్పుడే ఎన్నికలు..!
-
Pass Book : రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు.. ప్రతి యజమానికి భూధార్ నెంబర్..!









