Elections : గ్రామపంచాయతీ ఎన్నికలకు రెడీ.. అప్పుడే ఎన్నికలు..!
Elections : గ్రామపంచాయతీ ఎన్నికలకు రెడీ.. అప్పుడే ఎన్నికలు..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఎన్నికలకు ముందు జరగాల్సిన ప్రక్రియ ఇప్పటికే ప్రభుత్వం పూర్తి చేసింది. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాల సవరణలు కూడా పూర్తి చేసింది. ఏ సమయంలోనైనా ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమైంది.
ప్రధానంగా రిజర్వేషన్లను ఐదు సంవత్సరాలకు ఓసారి మార్చే విదంగా సవరణలు చేసింది. దాంతో పాటు పంచాయతీరాజ్ చట్టంలో కూడా సవరణలు చేసింది. అదే విధంగా ఒక మండలంలో ఐదుగురు ఎంపీటీసీలు ఉండే విధంగా కూడా మార్పులు చేసింది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు సూచించిన విధంగా ఖరారు చేయనున్నారు. బీసీ కమిషన్ ఇప్పటికే జిల్లాలో పర్యటనలు పూర్తి చేసుకుంది. ప్రభుత్వం చేపట్టిన కుటుంబ సర్వే కంప్యూటర్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం కూడా కొనసాగుతుంది. ఆ పూర్తి వివరాల ఆధారంగా కమిషన్ ప్రభుత్వానికి నివేదిక అందిస్తుంది. ఆ తర్వాత క్యాబినెట్.. నివేదికపై చర్చించి రిజర్వేషన్లు ఖరారు చేస్తారు.
ఆ తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేస్తుంది. ముందుగా గ్రామ పంచాయతీలలో సర్పంచ్, ఎంపీటీసీల ఎన్నికలు నిర్వహించనున్నారు. జనవరి నెలాఖరులో నోటిఫికేషన్ విడుదల చేసి ఫిబ్రవరి మాసంలో గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా మున్సిపాలిటీలో జనవరి 2025 నెలాఖరులో పాలకవర్గం ముగియనున్నది. ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలు కూడా నిర్వహించనున్నారు.
పంచాయతీలలో సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణ అనంతరం మున్సిపాలిటీలలో ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం అందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎలక్షన్ కమిషన్ కూడా ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతోంది.
MOST READ :
-
Pass Book : రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు.. ప్రతి యజమానికి భూధార్ నెంబర్..!
-
UPI : గూగుల్ పే ఫోన్ పే వాడుతున్నారా.. అయితే జనవరి కొత్త రూల్స్, తప్పక తెలుసుకోవాల్సిందే..!
-
Rythu Bharosa : రైతు భరోసా పై మంత్రి తుమ్మల క్లారిటీ.. ఒక్క రైతును కూడా తగ్గించం.. లేటెస్ట్ అప్డేట్..!
-
TG News : రైతులకు అదిరిపోయే శుభవార్త.. మరో కొత్త పథకం ప్రారంభం..!









