Chinthapally : దైవచింతనతో మానసిక ప్రశాంతత..!
దైవచింతనతో మానసిక ప్రశాంతత నెలకొంటుందని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నల్ల రఘుమారెడ్డి లు అన్నారు.

Chinthapally : దైవచింతనతో మానసిక ప్రశాంతత..!
దేవరకొండ ఎమ్మెల్యే నేనా వత్ బాలు నాయక్
చింతపల్లి, మన సాక్షి :
దైవచింతనతో మానసిక ప్రశాంతత నెలకొంటుందని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నల్ల రఘుమారెడ్డి లు అన్నారు. బుధవారం శ్రీ శ్రీ శ్రీ భవాని రామలింగేశ్వర స్వామి వార్ల వార్షిక (జాతర ) బ్రహ్మోత్సవాలలో పాల్గొని, గుట్టపై ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల చేత ప్రత్యేక ఆశీర్వచనాలు అందజేసి ఘనంగా సన్మానించారు.
శ్రీశ్రీశ్రీ భవాని రామలింగేశ్వర స్వామి స వారి ఆశీస్సులు దేవరకొండ నియోజకవర్గ ప్రాంత ప్రజలపై ఉంచి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, పాడిపంటలతో, సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజా పాలన – ప్రగతి ప్రకణాళిక కార్యక్రమంలో అధికారులతో కలిసి పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో తీదేడు మాజీ సర్పంచ్ కాయితి జితేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దాసరి శ్రీనివాస్ యాదవ్, మాజీ జెడ్పిటిసి జాంగిర్ నరసింహ యాదవ్ ఆలంపల్లి నరసింహ, వడ్త్యా దేవేందర్ నాయక్, చింతపల్లి మాజీ ఎంపీపీ కొండూరు భవాని పవన్ కుమార్ ఎరుకల వెంకటయ్య గౌడ్,
మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంగిరేకుల నాగభూషణం మాల్ మార్కెట్ కమిటీ చైర్మన్ దొంతం అలివేలు సంజీవరెడ్డి, ఎంపీడీవో సుజాత, ఎంపీ ఓ, హిందూజా, ఎస్ కే బాబా, మార్కెట్ కమిటీ డైరెక్టర్ హనుమానాయక్, రామావత్ శ్రీను నాయక్, పలు గ్రామాల సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, ఎస్ఐ ముత్యాల రామ్మూర్తి, గ్రామ ప్రజలు, వివిధ గ్రామాల భక్తులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
By : Puppala Venkateshwarlu, Sr.Reporter











