Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsకరీంనగర్జిల్లా వార్తలుపెద్దపల్లి జిల్లావిద్య

SSC : పది పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి..!

పదవ తరగతి వార్షిక పరీక్షలు శనివారం నుండి జరగనున్న దృష్ట్యా పరీక్షా కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేసినట్లు రామగుండం మండల విద్యాధికారి జింక మల్లేశం తెలిపారు.

SSC : పది పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి..!

విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలి –  రామగుండం ఎంఈఓ జింక మల్లేశం

గోదావరిఖని టౌన్, మన సాక్షి :

పదవ తరగతి వార్షిక పరీక్షలు శనివారం నుండి జరగనున్న దృష్ట్యా పరీక్షా కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేసినట్లు రామగుండం మండల విద్యాధికారి జింక మల్లేశం తెలిపారు.

మండలంలో మొత్తం 1,924 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో 991 మంది బాలురు, 937 మంది బాలికలు ఉన్నారు. మండల పరిధిలో 10 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

ఉదయం 9 గంటల లోపు హాల్ టికెట్ తో పరీక్షలకు హాజరు కావాలని తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో సెల్ ఫోన్లు ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించ బోమని స్పష్టం చేశారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా త్రాగునీరు, వైద్య సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

పరీక్షలు సజావుగా సాగేందుకు ఇన్విజిలేటర్లు నియమించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 అమలు చేయనున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని, విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని సూచించారు.

MOST READ 

మరిన్ని వార్తలు