Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరాజన్న సిరిసిల్ల జిల్లా

చిరుత పిల్లల సంచారం..!

చిరుత పిల్లల సంచారం..!

భయభ్రాంతులకు గురవుతున్నా గ్రామస్తులు

వేములవాడ,  (మనసాక్షి)

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలోని కోనరావుపేట మండలం శివంగలపల్లి గ్రామ శివారులో చిరుత పిల్లల సంచారం కలకలం రేపాయి. గురువారం రాత్రి సబ్ స్టేషన్ ఎదుట ఉన్న డంపింగ్ యార్డ్ సమీపంలో చిరుత పులి రెండు పిల్లలకు జన్మనిచ్చింది.

కాగా ఒక పిల్లను చిరుత తీసుకు వెళుతుండగా తెల్లవారుజామున పొలం పనుల వద్దకు వెళుతున్న రైతుల అలజడి విని సంఘటన స్థలంలోనే ఒక్క పిల్లను వదిలిపెట్టి వెళ్ళింది. చిరుత పిల్లను చూసిన రైతు గ్రామస్తులకు సమాచారం అందించాడు.

దీంతో అక్కడ ఉన్న ఆ చిరుత పిల్లను చూచేందుకు మండలం నుంచి అధిక సంఖ్యలో జనం తరలివచ్చి ఆ చిరుత పులి పిల్లతో ఫోటోలు దిగుతున్నారు. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని చిరుత పిల్లను కరీంనగర్ తరలిస్తామని అధికారులు తెలిపారు.

దీంతో గ్రామ ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు. వీలైనంత త్వరగా చిరుతను అటవీ శాఖాధికారులు పట్టుకోవాలని కోరుతున్నారు.

ALSO READ : Car Driver : కారు డ్రైవర్ ఖాతాలో రూ. 9 వేల కోట్లు జమ.. ఒక్కసారిగా షాక్ అయిన డ్రైవర్..!

మరిన్ని వార్తలు