Ration Cards : కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల పై స్పష్టం.. లేటెస్ట్ అప్డేట్..!

Ration Cards : కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల పై స్పష్టం.. లేటెస్ట్ అప్డేట్..!
మన సాక్షి:
తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ పై ఆ శాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. కులగణన సందర్భంగా జరిగిన సర్వే ఆధారంగా కొత్త రేషన్ కార్డులకు అర్హుల జాబితాను సిద్ధం చేశారు. అర్హుల జాబితాను జనవరి మాసంలో నిర్వహించిన గ్రామ సభలలో ప్రకటించారు.
అర్హుల జాబితాలో పేర్లు రాని వారికి ప్రభుత్వం మరో అవకాశం ఇస్తూ గ్రామసభలలో మరోసారి దరఖాస్తులు చేసుకోవాల్సిందిగా పేర్కొన్నారు. దాంతో కొత్త రేషన్ కార్డుల కోసం మరోసారి దరఖాస్తులు చేసుకున్నారు. ఇదిలా ఉండగా మీసేవ కేంద్రాలలో మరోసారి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తుల స్వీకరణ పై రాష్ట్రంలో గందరగోళమైన పరిస్థితి నెలకొన్నది. కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజల నుంచి మరోసారి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లుగా ప్రకటన చేయలేదని పౌరసరఫరాల శాఖ అధికారులు పేర్కొంటున్నారు.
కేవలం గ్రామ సభలలో వచ్చిన దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా పంపించాలని మీసేవ ను కోరినట్లు అధికారులు పేర్కొంటున్నారు. కాగా ప్రజలు కొత్త రేషన్ కార్డుల కోసం మీ సేవల చుట్టూ తిరుగుతూ గందరగోళమైన పరిస్థితి నెలకొన్నది. కొత్త రేషన్ కార్డుల కోసం అధికారులు దరఖాస్తు చేసుకోమన్నప్పటికీ ఎన్నికల కోడ్ కారణంగా ఆ ప్రక్రియ నిలిచిపోయిందనే ప్రచారం జరుగుతుంది.
కొత్త రేషన్ కార్డులకు తాము ఎలాంటి ప్రకటన చేయలేదని పౌరసరఫరాల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. రేషన్ కార్డులలో పేర్లు మార్పులు, పేర్లు చేర్చడం ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు పేర్కొంటున్నారు.
MOST READ :
-
UPI : ఫోన్ పే, గూగుల్ పే సేవలు నిలిచిపోనున్నాయి.. బిగ్ అలర్ట్..!
-
Elections : పంచాయతీలకు 300, ఎంపీటీసీ లకు 94 పోలింగ్ కేంద్రాల గుర్తింపు..!
-
చత్తీస్ఘడ్ లో భారీ ఎన్కౌంటర్.. 31 మంది మావోయిస్టుల హతం, ఇద్దరు జవాన్లు మృతి..!
-
Gold Price : రికార్డ్ స్థాయిలో గోల్డ్ రేట్.. ఈరోజు ఎంతంటే..!
-
Ration Cards : రేషన్ కార్డులకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం..!









