తెలంగాణBreaking Newsసంక్షేమం

Rythu Bharosa : రైతు భరోసా పై క్లారిటీ.. అర్హులు ఎవరు, అనర్హులు ఎవరు.. లేటెస్ట్ అప్డేట్..!

Rythu Bharosa : రైతు భరోసా పై క్లారిటీ.. అర్హులు ఎవరు, అనర్హులు ఎవరు.. లేటెస్ట్ అప్డేట్..!

మన సాక్షి , తెలంగాణ బ్యూరో :

తెలంగాణలో రైతులు ఎప్పుడు ఎప్పుడా అని ఎదురు చూస్తున్న రైతు భరోసా పథకాన్ని ప్రారంభించేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. ఈనెల 26వ తేదీన ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించిన విషయం తెలిసిందే.

అయితే రాష్ట్రవ్యాప్తంగా 1.35 కోట్ల ఎకరాల వ్యవసాయ భూమి కి రైతు భరోసా వర్తించేలా పథకాన్ని రూపొందించారు. దీని ద్వారా 64 లక్షల మంది రైతులకు, 12 లక్షల కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుంది. నెల 20వ తేదీ వరకు అర్హుల జాబితాను ఎంపిక చేస్తారు. 26వ తేదీ నుంచి రైతుల ఖాతాలలో ఒక విడత ఎకరానికి 6000 జమ కానున్నాయి.

దీనిపై రెండు మూడు రోజులుగా ప్రతి ఒక్క రైతులో కన్ఫ్యూజన్ ఏర్పడింది. అందుకోసం ప్రభుత్వం నిధులు విడుదల చేసేందుకు సిద్ధంగా ఉంది. ఇది ఇలా ఉండగా రైతు భరోసా దేనికి వర్తిస్తుంది. దేనికి వర్తించదనే విషయంపై క్లారిటీ ఏంటంటే..?

రైతు భరోసా దేనికి వర్తిస్తుంది :

  • వ్యవసాయ భూమి.

  • సాగు చేస్తున్న భూమి.

  • సాగు చేసే భూములే కాకుండా సాగుకు యోగ్యమైన భూములకు కూడా రైతు భరోసా వర్తిస్తుంది.

  • అంటే ఈ సీజన్ లో పంట వేయకుండా సాగులో ఉన్న భూమి అయితే రైతు భరోసా వర్తిస్తుందని అధికారులు పేర్కొంటున్నారు.

రైతు భరోసా దేనికి వర్తించదు :

  • మైనింగ్, కొండలు, గుట్టలున్న భూములు.

  • రియల్ ఎస్టేట్ వెంచర్లు, రహదారులు, పారిశ్రామిక వాణిజ్య సంబంధించిన భూములు.

  • నాలా కన్వర్ట్ చేసిన భూములు.

  • ప్రభుత్వం సేకరించిన భూములకు రైతు భరోసా వర్తించదు.

MOST READ : 

మరిన్ని వార్తలు