Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంతెలంగాణహైదరాబాద్

Cm Revanth: సీఎం రేవంత్ ఆదేశాలు.. యూట్యూబర్ పై కేసు నమోదు..!

Cm Revanth: సీఎం రేవంత్ ఆదేశాలు.. యూట్యూబర్ పై కేసు నమోదు..!

మన సాక్షి, వెబ్ డెస్క్:

చిన్నపిల్లలపై అసభ్యకరమైన జోకులు వేస్తూ తీసిన యూట్యూబ్ పై కేసు నమోదు అయింది. వివరాల ప్రకారం.. ఫన్ పేరుతో చిన్న పిల్లలపై అసభ్యకరమైన కామెడీ జోకులు వేస్తూ తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియో పై సినీ హీరో సాయిధరమ్ తేజ్ ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే హీరో సాయి ధరంతేజ్ చేసిన అభ్యర్థన మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెంటనే స్పందించారు. దానిపై తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు.

ALSO READBREAKING : ఇంటింటా ఇన్నోవేటర్, ఆ తేదీలోగా వివరాలు పంపాలి.. జిల్లా కలెక్టర్..!

తాజాగా ఈ ఘటనపై రేవంత్ రెడ్డి సంచల నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రముఖ యూట్యూబర్ పై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. తండ్రి కూతుళ్ళ బంధం పై అతనితో పాటు మరికొందరు యూట్యూబర్లు అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వీడియో వైరల్ అయ్యింది. హీరో సాయిధరమ్ తేజ్ ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదేశాలతో పోలీసులు కేసు ఫైల్ చేశారు. అలాంటి యూట్యూబర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని నేటిజన్లు పేర్కొంటున్నారు.

ALSO READ :.

KTR : మీకు అన్నగా ప్రచారం చేసుకుంటున్న సుధీర్ రెడ్డి.. అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ ట్వీట్..!

Batti, Revanth : వైయస్సార్ జయంతి వేడుకల్లో బట్టి విక్రమార్క వ్యాఖ్యలు.. దానికి రేవంత్ రెడ్డి అలా స్పందించారు..!

మరిన్ని వార్తలు