Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరాజకీయంహైదరాబాద్

KTR : మీకు అన్నగా ప్రచారం చేసుకుంటున్న సుధీర్ రెడ్డి.. అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ ట్వీట్..!

KTR : మీకు అన్నగా ప్రచారం చేసుకుంటున్న సుధీర్ రెడ్డి.. అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ ట్వీట్..!

హైదరాబాద్, మన సాక్షి :

మీ కాంగ్రెస్ నాయకులు అమ్మిన, మీ కాంగ్రెస్ ప్రభుత్వం క్రమబద్ధీకరణ చేసిన ప్లాట్లలో నిర్మించుకుంటున్న ప్రజల ఇండ్లను మేడ్చల్ మాజీ సుధీర్ రెడ్డి ఏమి ఆశించి ఈరోజు కూలగొట్టించాడో ఒకసారి విచారణ చేపించండి. ప్రజా పాలనలో ప్రజలకు మద్దతు వెళ్లిన బీఆర్ఎస్ నాయకులను పోలీసులతో నిర్బంధిస్తారా..? మీకు అన్నగా ప్రచారం చేసుకుంటూ సుధీర్ రెడ్డి మేడ్చల్ అసెంబ్లీ పరిధిలో చేస్తున్న అరాచకాలపై మీరు ఇంటెలిజెన్స్ నివేదిక తెప్పించుకోండి.

లేదంటే ప్రజలు తిరగబడుతారు. మీ నిర్బంధాలు ప్రజాగ్రహాన్ని నిలువరించలేవు. అమాయక ప్రజలకు ఈ ప్లాట్లు అమ్మింది కాంగ్రెస్ నాయకుడు రాందాస్ గౌడ్, మరో కాంగ్రెస్ నాయకుడు జగదీశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ కార్పొరేటర్ అమర్ సింగ్ కుటుంబం. ఈ ప్లాట్లను 2008లో నాటి సీఎం రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. గతంలో రెవెన్యూ అధికారులు ఇది పట్టా భూమిగా ఎన్వోసీ జారీ చేశారు.

ALSO FEAD : Batti, Revanth : వైయస్సార్ జయంతి వేడుకల్లో బట్టి విక్రమార్క వ్యాఖ్యలు.. దానికి రేవంత్ రెడ్డి అలా స్పందించారు..!

ప్రభుత్వ నిబంధనలకు లోబడి మున్సిపల్ అధికారుల అనుమతి తీసుకొని చాలా మంది ప్రజలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని ఇంటి నిర్మాణం చేసుకుంటున్నారు. కానీ మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అధికారులను వేధించి అమాయక ప్రజలు లక్షలు పోసి నిర్మించుకున్న ఇండ్లను ఈ రోజు కూలగొట్టించాడు.

పీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని సాయిప్రియ, సత్యనారాయణ పురం కాలనీ ప్లాట్ల యజమానుల సమస్యను శాశ్వతంగా తీర్చాలనే లక్ష్యంతో నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం 118 జీవో పరిధిలో చేర్చి ప్లాట్ ఓనర్స్ కు మేలు చేయడం జరిగింది.

కానీ ప్రజా పాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అసమర్థ ప్రభుత్వం అమాయక ప్లాట్ ఓనర్స్ ఇండ్లను కూల్చివేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలపై కక్షగట్టి చేస్తున్న వేధింపులకు ప్రజలు ముగింపు పలకడం ఖాయం. భవిష్యత్తులో మా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ ప్లాట్ ఓనర్లను న్యాయం చేయడం జరుగుతుంది. మా బీఆర్ఎస్ పార్టీ మేయర్ జక్క వెంకట్ రెడ్డిని, కార్పొరేటర్లను మీరు వేధిస్తున్నారు.

మేము ఇలా వేధించాలి అనుకుంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నామరూపాల్లేకుండా పోయేది. కాంగ్రెస్ ప్రభుత్వం వేధింపులకు మళ్ళీ వడ్డీతో సహా చెల్లిస్తాం. మా నాయకులను, మా మేయర్ ను, మా కార్పొరేటర్లను కంటికి రెప్పలా కాపాడుకుంటాం.

 

మరిన్ని వార్తలు