జాతీయంBreaking News

సోనియా గాంధీకి తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్.. అందజేసిన సీ ఎం రేవంత్..!

సోనియా గాంధీకి తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్.. అందజేసిన సీ ఎం రేవంత్..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి న్యూఢిల్లీలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకురాలు, రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీని మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా రూపొందించిన తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ను అందజేశారు.

తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్ 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 విశేషాలను సోనియా గాంధీకి తెలియజేశారు. ప్రజా పాలనలో గత రెండేండ్లుగా అమలవుతున్న సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, భవిష్యత్ ప్రణాళికలను వివరించారు.

ఈ సందర్భంగా, తెలంగాణలో ప్రజా ప్రభుత్వ పనితీరు, రాష్ట్ర అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి దూరదృష్టిని సోనియా గాంధీ అభినందించారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ కు అనుగుణంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షిస్తూ, సోనియా గాంధీ.. ముఖ్యమంత్రి కి శుభాకాంక్షలు తెలిపారు.

MOST READ :

  1. District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. గ్రీన్ ఫీల్డ్ హైవే వేగవంతంగా పూర్తి చేయాలి..!

  2. Narayanpet : జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ కీలక ప్రకటన.. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు సెల్ ఫోన్లు తీసుకురావద్దు..!

  3. TG News : రైతులకు మరో శుభవార్త.. ఎరువుల పంపిణీకి మొబైల్ యాప్, ఇంటి వద్ద నుంచే బుకింగ్..!

  4. TG News : రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. ఇక నో టెన్షన్..!

  5. TET : తెలంగాణ టెట్ షెడ్యూల్ రిలీజ్.. పరీక్ష తేదీలు ఇవే..!

మరిన్ని వార్తలు