TOP STORIESBreaking Newsతెలంగాణవిద్య

Cm Revanth Reddy : విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి భారీ శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా అమలు..!

Cm Revanth Reddy : విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి భారీ శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా అమలు..!

మన సాక్షి , తెలంగాణ బ్యూరో :

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభవార్త తెలియజేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు రేవంత్ రెడ్డి చర్యలు చేపట్టారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు సెంట్రలైజ్డ్ కిచెన్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ సెంట్రలైజ్డ్ కిచెన్ ద్వారా విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయం కూడా అల్పాహారాన్ని అందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఇప్పటికే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తుండగా ఈ నూతన విధానం ద్వారా ఉదయం వేళలో కూడా అల్పాహారం అందించనున్నారు.

ఈ సెంటర్ లైన్ సెంట్రలైజ్డ్ కిచెన్ కార్యక్రమాన్ని కొడంగల్ నియోజకవర్గం లో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టారు. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రారంభించనున్నారు.

హరే కృష్ణ చారిటబుల్ ఫౌండేషన్ ద్వారా కొడంగల్ నియోజకవర్గం లోని ప్రభుత్వ పాఠశాలలో 28 వేల మంది విద్యార్థులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించే పైలెట్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఆ నియోజకవర్గంలో సెంట్రలైజ్డ్ కిచెన్ నిర్మాణం పూర్తయిన వెంటనే ఈ పైలెట్ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు.

ఈ ఫౌండేషన్ ఫండ్స్ తో నిర్వహించే కార్యక్రమం పై ఫౌండేషన్ ప్రతినిధులతో రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి : 

Srisailam : శ్రీశైలం ప్రాజెక్టు 3 గేట్లు ఎత్తిన అధికారులు..!

WhatsApp : వాట్సాప్ లో సరికొత్త ఫీచర్.. ఫోన్ నెంబర్ లేకుండానే క్రియేట్ చేయొచ్చు..!

Nagarjunasagar : నాగార్జునసాగర్ జలాశయానికి కొనసాగుతున్న వరద.. 511 అడుగులకు చేరిన నీటిమట్టం.. Latest Update

మరిన్ని వార్తలు