TOP STORIESBreaking Newsతెలంగాణహైదరాబాద్

Schools : తెలంగాణలో స్కూళ్లపై సీఎం రేవంత్ సంచలన నిర్ణయం.. తాజా ఉత్తర్వులు జారీ..!

Schools : తెలంగాణలో స్కూళ్లపై సీఎం రేవంత్ సంచలన నిర్ణయం.. తాజా ఉత్తర్వులు జారీ..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

తెలంగాణలో పాఠశాలలకు బడి గంటలు మోగాయి. ప్రభుత్వ పాఠశాలతో పాటు ప్రైవేటు పాఠశాలలు కూడా పున ప్రారంభం అయ్యాయి. ఈనెల 12వ తేదీ నుంచి తెలంగాణ వ్యాప్తంగా అన్ని పాఠశాలలు ప్రారంభమయ్యాయి.

ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇకనుంచి నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతులను కూడా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది.

సమగ్ర శిక్ష పథకంలో భాగంగా 210 పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. 2025 -26 వ సంవత్సరానికి గాను ఈ పాఠశాలలో విద్యార్థులను చేర్చుకోవాలని స్పష్టం చేసింది.

దాంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలు కూడా పున ప్రారంభమయ్యాయి. అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు మొదటి రోజు చిన్నారులకు ఎగ్ బిర్యాని పెట్టనున్నారు. తొలి రోజు పిల్లలకు ఎగ్ బిర్యానీ పెట్టాలని మంత్రి సీతక్క ఆదేశించారు.

అదే విధంగా అంగన్వాడీ కేంద్రాలపై కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. చిన్నారుల అటెండెన్స్ పెరగాలంటే నాణ్యమైన పౌష్టికాహారం, బలవర్ధకమైన ఆహారం పెట్టాలని నిర్ణయించింది. మంచి ఆహారం పెట్టడం ద్వారా చిన్నారులను ఆకర్షించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. అందుకోసం ఎప్పటికప్పుడు మెనూ మారుస్తూ వస్తుంది.

MOST READ :

  1. WhatsApp : ఇక వాట్సాప్ కు శుభం కార్డేనా.. ఈ విషయం తెలిస్తే షాక్..!

  2. Miryalaguda : కరాటే లో గోల్డ్ మెడల్ సాధించిన భువనేశ్వర్.. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అభినందనలు..!

  3. TG News : కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరైన కేసీఆర్.. కొనసాగుతున్న ముఖాముఖి..!

  4. TG News : తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్..!

  5. Mahalakshmi Scheme : మహాలక్ష్మి పథకం ద్వారా 182 కోట్ల జీరో టిక్కెట్లు.. ఆడపడుచులకు రూ.6088 కోట్ల ఆదా..!

మరిన్ని వార్తలు