WhatsApp : ఇక వాట్సాప్ కు శుభం కార్డేనా.. ఈ విషయం తెలిస్తే షాక్..!
WhatsApp : ఇక వాట్సాప్ కు శుభం కార్డేనా.. ఈ విషయం తెలిస్తే షాక్..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికి వాట్సప్ ఉంది. ప్రస్తుత పరిస్థితులలో ఏ సమాచారం చేరవేయాలన్నా వాట్సాప్ ను వినియోగిస్తున్నారు. వాట్సాప్ లో షేర్ చేయడం, గ్రూప్ కాల్స్ మాట్లాడడం, ఆడియో కాల్స్, వీడియో కాల్స్ ఇలా ప్రతి ఒక్క దానికి వాట్సాప్ ను వినియోగిస్తున్నారు. ఉదయం లేచిన కానించి పడుకునే వరకు కూడా వాట్సాప్ లోనే ఉంటున్నారు. అలాంటిది వాట్సప్ కు శుభం కార్డు రాబోతుంది అని తెలిస్తే ఎలా ఉంటుందో చూడండి…
అయితే వాట్సప్ కు పోటీగా రాబోయే వాట్సప్ లాంటి మరో ఫెసిలిటీ ఎక్స్ చాట్ సరికొత్త డైరెక్ట్ మెసేజింగ్ ఫీచర్ త్వరలో రాబోతుంది. ఎక్స్ పేరుతో పేరు మార్చుకున్న ట్విట్టర్ యాప్ లో రాబోయే అరుదైన సౌకర్యం కల్పిస్తుంది.
బిజినెస్ లోను, సోషల్ మీడియాలోనూ దూసుకుపోతున్న ఎలెన్ మస్క్ దీనిపై సీరియస్ గా దృష్టి పెట్టారు. బిట్ కాయిన్ తరహాలో సెక్యూరిటీ ఉంటుందని భరోసా కల్పిస్తున్నారు. వారం రోజుల్లోనే లాంచింగ్ ఉంటుందని సంకేతం కూడా ఇచ్చారు.
ట్విట్టర్ ప్రీమియం సబ్ స్రైబర్స్ కొంతమంది ఎక్స్ చాట్ సర్వీసును వాడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఫీడ్ బ్యాక్ తీసుకొని త్వరలో ఎక్స్ చాట్ ను జనం ముందు పెట్టాలన్నది మస్క్ ప్లాన్. పూర్తిగా యాప్ గా మార్చాలనేది ఎలాన్ మస్క్ ప్లాన్ చేశారు. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్ట్ ఫీచర్ తో పూర్తి గోప్యంగా ఉండే ఎక్స్ చాట్ లో అనేక సౌకర్యాలు ఉన్నాయి.
వద్దనుకోగానే మెసేజ్ కూడా మాయమవుతుంది. ఫైల్ షేరింగ్, ఆడియో, వీడియో కాల్స్ వాట్సప్ కంటే మెరుగ్గా ఉండబోతుంది. అయితే యూజర్స్ కు ప్రైవసీకి, సెక్యూరిటీ కి ఏ మాత్రం కూడా భంగం కలవకుండా, ఇంకా ఫోన్ నెంబర్ కూడా అవసరం లేకుండా చాట్ సర్వీస్ రాబోతుంది. ఇది యాక్టివేషన్ లోకి వస్తే ఇక వాట్సప్ కు శుభం కార్డు పడనున్నది.
MOST READ :
-
Nalgonda : నల్గొండ ఆసుపత్రిలో బాలుడి కిడ్నాప్.. ఏడు గంటల్లో చేదించిన పోలీసులు.. కిడ్నాప్ ఎందుకో తెలిస్తే షాక్..!
-
TG News : కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరైన కేసీఆర్.. కొనసాగుతున్న ముఖాముఖి..!
-
Miryalaguda : కరాటే లో గోల్డ్ మెడల్ సాధించిన భువనేశ్వర్.. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అభినందనలు..!
-
TG News : తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్..!
-
Gold Price : వరుసగా తగ్గుతున్న బంగారం ధర.. ఈరోజు ఎంతంటే..!









