తెలంగాణBreaking Newsజిల్లా వార్తలుమహబూబాబాద్ జిల్లా

District collector : ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్ విస్తృత పర్యటన..!

District collector : ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్ విస్తృత పర్యటన..!

తొర్రూర్, మన సాక్షి :

మహబూబాబాద్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల, సేకరణ, రవాణా ప్రక్రియలపై జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ శ్రీ అద్వైత్ కుమార్ సింగ్  విస్తృత పర్యటన నిర్వహించారు. తొర్రూర్ మండలంలోని మాటేడు గ్రామం, పెద్ద వంగర మండలం, పోచంపల్లి, గంట్లకుంట, చిట్యాల గ్రామాలలో ఉన్న కొనుగోలు కేంద్రాలను ఆయన సందర్శించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రైతులు ఎలాంటి అధైర్యానికి లోనుకావద్దని, ప్రభుత్వం వారి పక్షంలో నిలబడి ఉందన్నారు. జిల్లాలో రికార్డు స్థాయిలో ధాన్యం ఉత్పత్తి జరిగిన నేపథ్యంలో, కేంద్రాల నిర్వహణను మరింత సమర్థవంతంగా చేపడుతున్నట్లు తెలిపారు.

ప్రత్యేక అధికారులు, అదనపు కలెక్టర్, తానే స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి, సమస్యలు పరిష్కరిస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ప్రభుత్వ సూచనల మేరకు ధాన్యాన్ని ఖచ్చితంగా సేకరించనున్నారు. వర్షాల అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని, ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అన్ని అవసరమైన సౌకర్యాలు కల్పించాలని, టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణలో ఏ శాఖా అధికారి నిర్లక్ష్యం వహించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతుల నుండి సేకరించిన ధాన్యాన్ని తక్షణమే రైస్ మిల్లులకు తరలించాలని, రైతులకు సంబంధించిన సమాచారం ఆన్లైన్‌లో నమోదు చేసి, నిధులను త్వరగా ఖాతాల్లో జమ చేయాలని సూచించారు.ఈ పర్యటనలో కలెక్టర్‌తో పాటు జిల్లా సహకార శాఖ అధికారి వెంకటేశ్వర్లు, సంబంధిత మండలాల తహసీల్దారులు, ఇతర శాఖల సిబ్బంది పాల్గొన్నారు.

MOST READ : 

  1. Flash.. Flash : వేములపల్లిలో రోడ్డు ప్రమాదం.. మిర్యాలగూడ యువకుడు మృతి..!

  2. District SP : రైతులకు జిల్లా ఎస్పీ కీలక సూచన.. భూతగాదాలు ఉంటే అలా పరిష్కరించుకోవాలి..!

  3. Business : ముత్తూట్ ఫిన్‌కార్ప్ రికార్డు లాభాలు.. జైడస్ లైఫ్‌సైన్సెస్ ‘సులభ పరీక్ష’ ప్రచారం..!

  4. TG News : నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. లేటెస్ట్ అప్డేట్..!

  5. Rythu Bharosa : రైతు భరోసా.. ఆ రైతులకు లేనట్టేనా..!

మరిన్ని వార్తలు