తెలంగాణBreaking Newsక్రైంజిల్లా వార్తలునల్గొండ

Miryalguda : వివాహితపై కాంగ్రెస్ నాయకుడి లైంగిక దాడి.. అవమానంతో మహిళ ఆత్మహత్యాయత్నం..!

Miryalguda : వివాహితపై కాంగ్రెస్ నాయకుడి లైంగిక దాడి.. అవమానంతో మహిళ ఆత్మహత్యాయత్నం..!

వేములపల్లి, మన సాక్షి:

వివాహిత మహిళపై లైంగిక దాడి చేసిన ఒకరిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు కాగా సదరు మహిళ అవమాన భారంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలోని వేములపల్లి మండలంలోని లక్ష్మీదేవి గూడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు గంటా కృష్ణయ్య గత నెల 21న అదే గ్రామానికి చెందిన ఓ ఎస్ టి మహిళ ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఆమె లైంగిక దాడికి పాల్పడ్డాడు.

అంతలో ఆమె భర్త ఇంటికి రావడంతో కాంగ్రెస్ నాయకుడు పారిపోయాడు. దీంతో మనస్థాపానికి గురై నా సదరు మహిళ అదే రాత్రి ఇంట్లో ఉన్న పురుగుల మందును సేవించింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను సూర్యాపేటకు తరలించగా పరిస్థితి విషమించడంతో హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతుంది.

దీంతో బాధిత మహిళ మామ ఫిర్యాదు మేరకు వేములపల్లి పోలీసులు డిఎస్పి రాజశేఖర్ రాజు ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. కాగా మహిళపై దాడి చేసిన ఘంటా కృష్ణయ్య సైతం పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం కృష్ణ కోలుకోగా బాధ్యత మహిళ పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు స్థానికులు తెలిపారు.

MOST READ :

 

మరిన్ని వార్తలు