సరైన పత్రాలు లేకుండానే పంట రుణాలు.. ఆ రైతులకు రుణమాఫీ వస్తుందా..!
సరైన పత్రాలు లేకుండానే పంట రుణాలు.. ఆ రైతులకు రుణమాఫీ వస్తుందా..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో:
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు రైతులను రుణమాఫీ కలవర పెడుతుంది. డాక్యుమెంట్ల లో తప్పులు ఉండడం రుణమాఫీ సమయంలో లక్షల మంది ఖాతాలు సరిగ్గా లేవని తేలింది.
ఇప్పుడు బ్యాంకు అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు పత్రాలను సరి చేసే పనిలో ఉన్నారు. వాస్తవానికి పత్రాలు సరిగ్గా లేకుండానే రుణాలు ఇచ్చారా..? లేదా కాలయాపన కోసం పత్రాలు సరిచేస్తున్నామని చెబుతున్నారా..? ఈ విషయం రైతులను కలవరం పెడుతోంది.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రెండు లక్షల రూపాయల రైతు రుణాలను మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15వ తేదీ వరకు మూడు విడతలుగా రుణమాఫీ చేశారు.
ముందుగా చెప్పిన విషయంలో సుమారు 31 వేల కోట్ల రూపాయలతో రుణమాఫీ చేస్తున్నామని ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు కేవలం 19 వేల కోట్ల రూపాయలతోనే పూర్తిస్థాయిలో రుణమాఫీ చేసినట్లు ప్రకటించారు.
ఇంకా 12 వేలకోట్ల రూపాయలు రుణమాఫీ చేయాల్సి ఉంది. వీరి ఖాతాలలో తప్పులు ఉండడం వల్ల, ఆధార్ కార్డులో పేర్లు సరిగ్గా లేకపోవడం వల్ల రుణమాఫీ కాలేదని అధికారులు పేర్కొంటున్నారు.
అయితే ఆధార్ కార్డులో పేర్లు సరిగా లేకుండానే వీరందరికీ గతంలో రుణాలు ఇచ్చారా..? అని అనుమానం కలుగుతుంది. బ్యాంకు అధికారులు.. బ్యాంకు ఖాతాకు, ఆధార్, పాన్ కార్డు లింక్ ఎప్పుడు చేశారు. ఆ సమయంలోనే అన్ని పత్రాలు సరిచూసుకొని డేటా అంత లింక్ చేశారు.
ఆధార్ కార్డులో పేర్లు స్పెల్లింగ్ మిస్టేక్ లు ఉన్న వాటితో సంబంధం లేకుండానే ఆధార్ నెంబర్ తో లింక్ చేశారు. మరి ఇప్పుడు ఆధార్ నెంబర్.. బ్యాంకు ఖాతా నెంబర్ లింక్ ఉన్నప్పటికీ పేరులో ఉన్న స్పెల్లింగ్ మిస్టేక్ కారణంగా రుణమాఫీ రాలేదని పేర్కొంటున్నారు.
దాంతో రైతులు వ్యవసాయ పనులు వదులుకొని కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదిలా ఉండగా రేషన్ కార్డుతో కూడా లింక్ పెట్టి కుటుంబ సభ్యుల వివరాలను సేకరించాల్సి ఉంది.
అందుకుగాను రుణమాఫీ రైతులు వ్యవసాయ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అధికారిక లెక్క1.20 లక్షల మంది రైతులకు ఆధార్ ఇతర పత్రాల్లో తప్పులు ఉన్నందున రుణమాఫీ కాలేదని చెబుతున్నారు.
కానీ క్షేత్రస్థాయిలో ఇంకా చాలామంది రైతులు రుణమాఫీ కాని వారు ఉన్నారు. వాస్తవానికి వీరందరికీ మరో విడత రుణమాఫీ చేస్తారా..? లేదా..? అనేది వేచి చూడాల్సి ఉంది.
ALSO READ :
Nalgonda : ప్రశ్నిస్తే బ్యాంకు చుట్టూ తిప్పుతాం.. రైతులను హడలెత్తిస్తున్న బ్యాంకు మేనేజర్..!
Job Mela : టెన్త్, ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు.. ఆగస్టు 21న జాబ్ మేళా..!









