Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణభద్రాద్రి కొత్తగూడెం జిల్లా
Dammapet : కోర్టు భవనాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ..!
Dammapet : కోర్టు భవనాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ..!
దమ్మపేట, మన సాక్షి :
దమ్మపేటలో మార్చి 2న ప్రారంభానికి సిద్దమైన జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు భవనాన్ని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ శుక్రవారం పరిశీలించారు. కోర్టు భవన నిర్మాణ పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు.
తాను ఎమ్మెల్యే ఉన్న సమయంలో కోర్టు భవనం పూర్తయి ప్రజలకు అందుబాటులోనికి రావటం సంతోషంగా ఉందని, గిరిజన ప్రాంతంలో చాలా సమస్యలు ఇక్కడే పరిష్కారం అవుతాయని సంతోషం వ్యక్తం చేశారు. వారితోపాటు మరగాని హరిబాబు, కక్కిరాల రమేష్ ,చిన్నశెట్టి యుగంధర్, పగడాల రాంబాబు, కాంగ్రెస్ కార్యకర్తలు జుడిషియల్ కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
ALSO READ : Telangana : కాంగ్రెస్ నేత వంశీ చందర్ రెడ్డి కెసిఆర్ కు సంచలన లేఖ..!









