Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణమహబూబ్‌నగర్రాజకీయం

Telangana : కాంగ్రెస్ నేత వంశీ చందర్ రెడ్డి కెసిఆర్ కు సంచలన లేఖ..!

Telangana : కాంగ్రెస్ నేత వంశీ చందర్ రెడ్డి కెసిఆర్ కు సంచలన లేఖ..!

మన సాక్షి ,తెలంగాణ బ్యూరో :

కాంగ్రెస్ నేత మహబూబ్ నగర్ లోకసభ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేయనున్న అభ్యర్థి వంశీచందర్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ కు సంచలన లేఖ రాశారు. మహబూబ్ నగర్ నుంచి గతంలో పోటీ చేసిన కేసీఆర్ ప్రజలను మోసం చేశాడని ఆరోపించారు.

రాజకీయ పునర్జన్మ ఇచ్చిన మహబూబ్ నగర్ అంటే కెసిఆర్ కు నచ్చదని పేర్కొన్నారు. కృష్ణా జలాల విషయంలో వారు ఏ తప్పు చేయలేదని చెప్పే ధైర్యం ఉంటే మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలవాలని ఆయన సవాల్ చేశారు. మహబూబ్ న గర్ ప్రజల కన్నీటి గాధలు అనంతం అని వంశీచందర్ రెడ్డి పేర్కొన్నారు.

కృష్ణా జలాల్లో మన వాటా నీటిని బీఆర్ఎస్ ప్రభుత్వం సరిగా వినియోగించుకోలేకపోయిందని పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసమర్థత వల్లనే కృష్ణ నీటిలో తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు. రేపు సాయంత్రం మహబూబ్ నగర్ లో కేసీఆర్ బండారం అంతా బయట పెడతానని లెఖ లో పేర్కొన్నారు. దమ్ముంటే తనపై పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు.

ALSO READ : Telangana : కేటీఆర్ పై క్రిమినల్ కేసు..? క్షమాపణ చెప్పకుంటే పెడతాం..!

మరిన్ని వార్తలు