Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరాజకీయంహైదరాబాద్

Telangana : కేటీఆర్ పై క్రిమినల్ కేసు..? క్షమాపణ చెప్పకుంటే పెడతాం..!

Telangana : కేటీఆర్ పై క్రిమినల్ కేసు..? క్షమాపణ చెప్పకుంటే పెడతాం..!

మన సాక్షి , తెలంగాణ బ్యూరో :

తెలంగాణలో రాజకీయం రసవతరంగా మారుతుంది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మరోసారి అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య వివాదం రాజుకుంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించడం పట్ల కాంగ్రెస్ పార్టీ నేతలు భగ్గుమంటున్నారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కు తీసుకోవాలని, బహిరంగంగా క్షమాపణ చెప్పాలని టిపిసిసి ఉపాధ్యక్షులు బండ్రు శోభారాణి డిమాండ్ చేశారు.

తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పుతో కేటీఆర్ చిన్న మెదడు చితికిపోయి మాట్లాడుతున్నారని, ఆయన క్షమాపణ చెప్పకుంటే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం అభ్యర్థిగా ముందే రేవంత్ రెడ్డిని ప్రకటించి ఉంటే ఆ పార్టీకి 30 సీట్ల కంటే ఎక్కువ వచ్చేవి కావని, అసలు రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడడం లేదని.. అతని పాత బుద్ధులను మెల్లగా బయటపడుతున్నాయని విమర్శించారు.

ALSO READ : ముందే చెప్పినట్లుగా.. ముగ్గురిని ఇంటికి పంపారు..!

కాంగ్రెస్ పార్టీ వాళ్లు కూడా అధికారంలోకి వస్తామని ఊహించుకోలేక పోయారని ఎద్దేవ చేశారు. కాంగ్రెస్ వాళ్లు ఇటుకలతో కొడితే.. తాము రాళ్లతో కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయన్నారు . దాంతో కేటీఆర్ పై కాంగ్రెస్ నాయకులు బగ్గుమంటున్నారు. కేటీఆర్ చిన్న మెదడు చితికిపోయిందని, బీఆర్ఎస్ నేతలు అందరూ ఆసుపత్రిలో చూపించుకోవాలని అన్నారు.

లంకె బిందె లాంటి రాష్ట్రాన్ని దివాలా తీసేలా చేశారని ఆరోపించారు. కాలేశ్వరం ప్రాజెక్టు పేరుతో రాష్ట్ర ఖజానా హరీష్ రావు ఖాళీ చేశారని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజలకు స్వేచ్ఛ లేకుండా చేశారని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రజలకు విముక్తి కలిగింది. ఆస్తుల చిట్టాని కేసీఆర్ కుటుంబం బయటపెట్టాలని కోరారు. కేటీఆర్ క్షమాపణ చెప్పాలని లేదంటే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు.

ALSO READ : Chenchu Lakshmi : కొంపముంచిన యూట్యూబర్ వీడియో.. పోలీసుల అదుపులో చెంచులక్ష్మీ..!

మరిన్ని వార్తలు