ముందే చెప్పినట్లుగా.. ముగ్గురిని ఇంటికి పంపారు..!

అనధికారికంగా విద్యుత్ సరఫరా నిలిపివేసి ఇబ్బందులను ఇబ్బందులకు గురి చేస్తే ఉద్యోగులను సస్పెండ్ చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించిన విషయం విధితమే. అయినప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు వినకుండా విద్యుత్ ను నిలిపివేసిన ముగ్గురు ఉద్యోగులను సస్పెండ్ చేశారు.

ముందే చెప్పినట్లుగా.. ముగ్గురిని ఇంటికి పంపారు..!

హైదరాబాద్, మన సాక్షి :

అనధికారికంగా విద్యుత్ సరఫరా నిలిపివేసి ఇబ్బందులను ఇబ్బందులకు గురి చేస్తే ఉద్యోగులను సస్పెండ్ చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించిన విషయం విధితమే. అయినప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు వినకుండా విద్యుత్ ను నిలిపివేసిన ముగ్గురు ఉద్యోగులను సస్పెండ్ చేశారు.

హైదరాబాదులోని కొండాపూర్ డివిజన్ లో అల్లాపూర్ సెక్షన్ పరిధిలో అయ్యప్ప సొసైటీ ఉప కేంద్రంలో ముగ్గురు ఉద్యోగులను సస్పెండ్ చేశారు. అయ్యప్ప సొసైటీ ఉప కేంద్రంలో విధులు నిర్వహించే లైన్మెన్ నరసింహ, జూనియర్ లైన్ మెట్లు దస్రు, విజయ్ లను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.

ALSO READ : Inter Exams : నిమిషం ఆలస్యం.. పరీక్షకు అనుమతించని అధికారులు, గేటు బయట ముగ్గురు ఇంటర్ విద్యార్థులు..!

సర్వే ఆఫ్ ఇండియా కాలనీలో శుక్రవారం ఈ ముగ్గురు విద్యుత్ అధికారులు అనధికారికంగా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఆ తర్వాత ఉన్నతాధికారుల నుంచి అనుమతి తీసుకోకుండా నిర్మాణంలో ఉన్న భవనానికి విద్యుత్ తీగలను మార్చడం చేశారు. ఈ విషయంపై సిఎండికి ఫిర్యాదు అందడంతో పరిశీలించి ముగ్గురిని సస్పెండ్ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా అకారణంగా విద్యుత్ సరఫరా నిలిపివేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించిన విషయం విధితమే.

విద్యుత్ సరఫరా లో కోతలు విధించడం లేదని, గతంలో కంటే విద్యుత్ సరఫరా పెరిగిందని, అయినప్పటికీ కొందరు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సీఎం రేవంత్ మండపడ్డారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకు విద్యుత్ సరఫరా పై దృష్టి ప్రచారం చేసేందుకు కొందరు కుట్రలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు.

ALSO READ : ACCIDENT : నేషనల్‌ హైవే 161 రోడ్డుపై ఘోర ప్రమాదం.. ముగ్గురు యువకులు మృతి..!

అటువంటి పనులను పాల్పడే అధికారులు, సిబ్బంది పై చర్యలు తీసుకుంటామని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. అయినప్పటికీ వినకుండా విద్యుత్ సరఫరా నిలిపివేసి కాలనీవాసులను ఇబ్బందులకు గురి చేసిన ముగ్గురు అధికారులను సస్పెండ్ చేశారు.