ACCIDENT : నేషనల్‌ హైవే 161 రోడ్డుపై ఘోర ప్రమాదం.. ముగ్గురు యువకులు మృతి..!

నిలబడి ఉన్న కారును, యువకులను ఆయిల్‌ ట్యాంకర్‌ ఢీకొనడంతో ముగ్గురు మైనార్టీ యువకులు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా అందోలు మండలం మాసానిపల్లి గ్రామ శివారులోని అండర్‌పాస్‌ సమీపంలోని నాందేడ్‌–అకోలా జాతీయ రహదారి సర్వీస్‌రోడ్డుపై జరిగింది.

ACCIDENT : నేషనల్‌ హైవే 161 రోడ్డుపై ఘోర ప్రమాదం.. ముగ్గురు యువకులు మృతి..!

  • కారును ఢీకొట్టిన ఆయిల్‌ట్యాంకర్‌
  • 20 కి.మీ దూరంలో ప్రమాదానికి గురైన ట్యాంకర్, డ్రైవర్‌ మృతి
  • మాసానిపల్లి సర్వీస్‌రోడ్డుపై ఘటన
  • జోగిపేట మైనార్టీలో కాలనీలో విషాధం

అందోలు, మనసాక్షిః

నిలబడి ఉన్న కారును, యువకులను ఆయిల్‌ ట్యాంకర్‌ ఢీకొనడంతో ముగ్గురు మైనార్టీ యువకులు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా అందోలు మండలం మాసానిపల్లి గ్రామ శివారులోని అండర్‌పాస్‌ సమీపంలోని నాందేడ్‌–అకోలా జాతీయ రహదారి సర్వీస్‌రోడ్డుపై జరిగింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మైనార్టీ యువకులు జోగిపేటకు చెందిన ఎండీ వాజీద్‌ (29), ముక్రమ్‌ (26), ఎండీ హజీ (26)లు మృతి చెందారు.

ఈ సంఘటన సోమవారం అర్దరాత్రి జరిగింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఎండీ వాజీద్, ముక్రమ్, హజీ, రిజ్వాన్, అర్షద్, శంషులు టీఎస్‌ 15, ఎఫ్‌జీ 0882 నంబరు గల కారులో డాకూరు వైపు వెళుతూ మాసానిపల్లి అండర్‌పాస్‌ దగ్గరలో రోడ్డు ప్రక్కన నిలుపుకొని వాజీద్, ముక్రమ్, రిజ్వాన్‌లు మూత్ర విసర్జన నిమిత్తం వెళ్లి కారు వద్దకు వస్తుండగా సంగుపేట వైపు నుంచి జిజే 12, బీజడ్‌ 9649 నంబరు గల ఆయిల్‌ ట్యాంకర్‌ అతివేగంగా డాకూరు వైపు వెళుతూ అర్దరాత్రి 12.30 గంటల ప్రాంతంలో ఢీకొట్టింది.

ALSO READ : BRS : కాలేశ్వరం రాజకీయం.. మార్చి 1న చలో మేడిగడ్డ పిలుపునిచ్చిన కేటీఆర్..!

దీంతో కారులో ఉన్న ముగ్గురిలో హజీ అనే యువకుడు మరణించగా, మరొ ఇద్దరు స్వల్ప గాయాలతో బయట పడ్డారు. ప్రత్యక్ష సాక్షులు సమాచారం ఇవ్వడంతో వెంటనే స్థానికులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సీఐ అనిల్‌కుమార్, ఎస్‌ఐ అరుణ్‌కుమార్‌ గౌడ్‌లు పోలీసు సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను వెంటనే జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చూరీకి తరలించారు. గాయపడ్డ రిజ్వాన్‌ను ఉస్మానియా ఆసుపత్రికి తరించారు.
అల్లాదుర్గం వద్ద ట్యాంకర్‌ బోల్తా : 

మాసానిపల్లి సర్వీస్‌రోడ్డులో ముగ్గురు యువకులను బలిగొన్న జిజే 12, బీజడ్‌ 9649 నంబరు గల ఆయిల్‌ ట్యాంకర్‌ మెదక్‌ జిల్లా అల్లాదుర్గం సమీపంలో బోల్తా కొట్టింది. ఈ సంఘటనలో ట్యాంకర్‌ డ్రైవర్‌ కియారాం (25) మృతి చెందారు. ట్యాంకర్‌ టైర్లు, ట్యాంకర్‌కుS మాంసం ముద్దలు, రక్తం మరకలు ఉండడంతో ఇదే ట్యాకర్‌ కారును, యువకులను ఢీకొట్టినట్లుగా పోలీసులు నిర్దారణకు వచ్చారు. ట్యాంకర్‌ కారును ఢీకొనడం వల్లనే ప్రమాదం జరిగినట్లు సీఐ అనిల్‌కుమార్‌ తెలిపారు.

ALSO READ : BANDLA GANESH : కేటీఆర్ అమెరికా వెళ్ళింది అందుకే.. కేటీఆర్, రోజా పై బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు..!

జోగిపేటలో విషాధం : 

జోగిపేటకు చెందిన ముగ్గురు మైనార్టీ యువకులు రోడ్డు ప్రమాదంలో మరణించడంతో జోగిపేట పట్టణంలో మంగళవారం ఉదయం నుంచే విషాధఛ్చాయలు అలుముకున్నాయి. ప్రమాదంలో మృతి చెందిన వాజీద్‌ అనే యువకుడి భార్య గర్బవతియని, రెండు, మూడు రోజుల్లోనే డెలివరీ కూడా ఉందని తెలుసుకొన్న స్థానికులు ఆయ్యో పాపం తనకు పుట్టబోయేది ఆడ బిడ్డా, మగ బిడ్డనా తెలియకుండానే కళ్లు మూసాడా అని ఆవేదన వ్యక్తం చేశారు. ఎండీ వాజీద్, ముక్రమ్‌ , ఎండీ హజీలు ముగ్గురు మంచి స్నేహితులని, ఎప్పటికి కలిసి తిరిగే వారని చనిపోయినప్పుడు కూడా కలిసి చనిపోయారని పలువురు అన్నారు.

కౌన్సిలర్‌ చిట్టిబాబు పరామర్శ

సంఘటన జరిగిన విషయం తెలియగానే జోగిపేట ఆసుపత్రిలోని మార్చూరీలో ఉన్న ముగ్గురు మృతదేహాలను జోగిపేట 17వ వార్డు కౌన్సిలర్‌ ఆకుల సత్యనారాయణ (చిట్టిబాబు) పరామర్శించారు. యువకుల మృతి పట్ల సంతాపాన్ని తెలియజేశారు. ప్రమాదం జరిగిన తీరును తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు సంతాపాన్ని తెలియజేశారు. పలువురు బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు కూడా మృతుల కుటుంబాలను పరామర్శించి సంతాపాన్ని తెలియజేశారు.

మరెన్నో బ్రేకింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…

Manasakshi