BRS : కాలేశ్వరం రాజకీయం.. మార్చి 1న చలో మేడిగడ్డ పిలుపునిచ్చిన కేటీఆర్..!

తెలంగాణలో నీటి రాజకీయం ఊపందుకుంది. అధికార ప్రతిపక్ష పార్టీలు సైతం నీటి రాజకీయాల వైపే తిరుగుతున్నాయి. ఇటీవల నల్లగొండలో ప్రతిపక్ష బీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహించి కృష్ణా జలాలపై చైతన్య కోసం ప్రయత్నం చేసింది తెలిసిందే.

BRS : కాలేశ్వరం రాజకీయం.. మార్చి 1న చలో మేడిగడ్డ పిలుపునిచ్చిన కేటీఆర్..!

తెలంగాణ బ్యూరో, మన సాక్షి :

తెలంగాణలో నీటి రాజకీయం ఊపందుకుంది. అధికార ప్రతిపక్ష పార్టీలు సైతం నీటి రాజకీయాల వైపే తిరుగుతున్నాయి. ఇటీవల నల్లగొండలో ప్రతిపక్ష బీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహించి కృష్ణా జలాలపై చైతన్య కోసం ప్రయత్నం చేసింది తెలిసిందే. కాగా కాలేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఆర్ఎస్ అవినీతికి పాల్పడిందని కృంగిన పిల్లర్లను, మేడిగడ్డ బ్యారేజీను అధికారపక్షం ఎమ్మెల్యేలు మంత్రులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లి సందర్శించి ప్రజలకు వివరించింది తెలిసిన విషయమే.

కాగా కాలేశ్వరం ప్రాజెక్టు పై బీఆర్ఎస్ ప్రజలకు వివరించే ప్రయత్నం చేయడానికి చలో మేడిగడ్డ అని కేటీఆర్ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంగళవారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పై నిప్పులు చేరిగారు. కాలేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చే కుట్ర చేస్తుందని కేటీఆర్ ఆరోపించారు.

కాలేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మూడు బ్యారేజీలు కొట్టుకుపోవాలని రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నట్లు కేటీఆర్ ఆరోపించారు. మేడిగడ్డకు వెంటనే మరమ్మతులు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాలేశ్వరం ప్రాజెక్టు వల్లనే పాతాళ గంగ పైకి వచ్చిందని.. ఖర్చులు, లాభాలు లెక్కలు వేస్తే హాస్పిటల్స్, ఐఐటీలు కట్టొద్దని వ్యాఖ్యానించారు.

ALSO READ : Chevelle : కౌన్సిలర్ పదవులకు రాజీనామా చేసి ఇంకో పార్టీలో చేరాలి.. చేవెళ్ల ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు..!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని కేటీఆర్ ఫైర్ అయ్యారు. కాలేశ్వరం విషయంలో అసలు పని తాను చేశామని.. మిగిలిపోయిన కొసరు పని చేయకుండా బధనం చేస్తున్నారంటూ కాంగ్రెస్  ఆయన నిప్పులు చేరిగారు. కాలేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్టలు చేస్తుందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మార్చి ఒకటో తేదీన చలో మేడిగడ్డ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఉదయం 8 గంటలకు 200 మందితో మేడిగడ్డకు వెళ్తామన్నారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తోపాటు ముఖ్య నాయకులు అందరిని కలిసి కాలేశ్వరం ప్రాజెక్టును సందర్శిస్తామన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టు వద్ద నుంచే అన్ని వాస్తవాలను ప్రజలకు వివరిస్తామని కేటీఆర్ చెప్పారు. మేడిగడ్డ లో  దురదృష్టవశాత్తు రెండు పిల్లర్స్ పగులు వచ్చాయని, ఇలాంటివి కొత్తవి కాదని బెంగాల్లో పరక బ్యారేజ్ కూలిందని గుర్తు చేశారు.

ALSO READ : Zero bills for home electricity : గృహ విద్యుత్ కు ఇక జీరో బిల్లులు, ఎప్పటినుంచంటే.. ఆదేశించిన రేవంత్ రెడ్డి..!

తెలంగాణలో కడెం ప్రాజెక్టు, సింగూరు, మూసి గేట్లు కొట్టుకుపోయాయని గుండ్ల వాగు ప్రాజెక్టు సైతం కొట్టుకుపోయిందని కేటీఆర్ పేర్కొన్నారు. గుజరాత్ లో మచ్చు ప్రాజెక్టు కూలిపోతే రెండు వేల మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. మేడిగడ్డలో కాపర్ డ్యాం కట్టి రిపేర్ చేయొచ్చు అన్నారు. మేడిగడ్డపై విచారణ చేయాలని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కేటీఆర్ పేర్కొన్నారు. చిన్న ప్రమాదాన్ని భూతద్దంలో పెట్టి కాంగ్రెస్ నాయకులు చూపిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. చలో మెడిగడ్డ కార్యక్రమానికి టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ రావడంలేదని చెప్పారు.

మరెన్నో బ్రేకింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి. https://manasakshi.in/