Chevelle : కౌన్సిలర్ పదవులకు రాజీనామా చేసి ఇంకో పార్టీలో చేరాలి.. చేవెళ్ల ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు..!

బిఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచిన కౌన్సిలర్లు పార్టీ మారాలనుకుంటే కౌన్సిలర్ పదవులకు రాజీనామా చేసి వేరే పార్టీలో చేరాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు.

Chevelle : కౌన్సిలర్ పదవులకు రాజీనామా చేసి ఇంకో పార్టీలో చేరాలి.. చేవెళ్ల ఎమ్మెల్యే

కీలక వ్యాఖ్యలు..!

శంకర్‌పల్లి, (మన సాక్షి):

బిఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచిన కౌన్సిలర్లు పార్టీ మారాలనుకుంటే కౌన్సిలర్ పదవులకు రాజీనామా చేసి వేరే పార్టీలో చేరాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. సోమవారం మున్సిపల్ పరిధిలోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే యాదయ్య మాట్లాడుతూ..

ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ పార్టీకి చెందిన వైస్ చైర్మన్ వెంకట్ రామ్ రెడ్డి, ఇద్దరు కౌన్సిలర్లు సంధ్యారాణి అశోక్ కుమార్, సంతోష్ రాథోడ్ వారి పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్, కౌన్సిలర్లు రాధ బాలకృష్ణ, లక్ష్మమ్మ రామ్ రెడ్డి, శ్వేత పాండురంగారెడ్డి, శ్రీనాథ్, అశోక్, గోపాల్, చంద్రమౌళి, కో ఆప్షన్ సభ్యుడు వెంకటరెడ్డి ఉన్నారు.