Chenchu Lakshmi : కొంపముంచిన యూట్యూబర్ వీడియో.. పోలీసుల అదుపులో చెంచులక్ష్మీ..!

ఓ యూట్యూబర్​ చేసిన వీడియో వైరల్ కావడంతో అటవీ జంతువుల అవయవాలను అమ్ముతున్నారనే విషయాన్ని గుర్తించి ఫారెస్ట్​ అధికారులు వస్తువులను స్వాధీనం చేసుకొని మహిళను అరెస్ట్ చేశారు.

Chenchu Lakshmi : కొంపముంచిన యూట్యూబర్ వీడియో.. పోలీసుల అదుపులో చెంచులక్ష్మీ..!

మేడారంలో అటవీ జంతువుల అవయవాలు విక్రయం

– యూట్యూబ్​ తో విషయం బయటకు

ములుగు, మన సాక్షి ప్రతినిధి :

ఓ యూట్యూబర్​ చేసిన వీడియో వైరల్ కావడంతో అటవీ జంతువుల అవయవాలను అమ్ముతున్నారనే విషయాన్ని గుర్తించి ఫారెస్ట్​ అధికారులు వస్తువులను స్వాధీనం చేసుకొని మహిళను అరెస్ట్ చేశారు. అటవీ రేంజ్​ అధికారి శంకర్​ తెలిపిన వివరాల ప్రకారం. భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెంచుకాలనీకి చెందిన చెంచు లక్ష్మీ తనకు వచ్చిన ప్రకృతి వైద్యం చేస్తూ జీవనం సాగిస్తోంది. మేడారం మహాజాతర నేపథ్యంలో వారంరోజులపాటు జాతరలో ఉండి ప్రకృతి వనమూళికలతో ఏ వ్యాధినైనా నయం చేస్తానంటూ భక్తులకు జోష్యం చెప్పింది.

జాతరకు వచ్చిన ఓ యూట్యూబర్​ చెంచు లక్ష్మీకి సంబంధించిన వీడియోచేసి ఆమె వద్ద ఏరోగానికి ఏ మందులు ఉన్నాయో అడిగి తెలుసుకున్నాడు. ఈ వివరాలన్నీ వీడియో తీసుకున్న సదరు యూట్యూబర్​ సోషల్ మీడియాలో పోస్టుచేసి వైరల్ చేశాడు. ఈ విషయం కాస్తా ఫా యూట్యూబ్స్ట్​ ఆఫీసర్ల దృష్టిలో పడటంతో ఆరా తీసి చెంచుకాలనీకి వెళ్లి చెంచులక్ష్మీ ఇంటిని సోదా చేశారు. అక్కడ వారికి అటవీ జంతువుల అవయవాలు, మూళికలు లభించాయి.

చట్టవిరుద్ధంగా కలిగి ఉన్న వాటిని సీజ్​ చేసిన అధికారులు ములుగు రేంజ్​ కార్యాలయానికి తరలించి చెంచు లక్ష్మీని అరెస్ట్​ చేశారు. వన్యప్రాణుల సంరక్షణ చట్టం ప్రకారం చెంచు లక్ష్మీపై కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్​ రేంజర్లు శంకర్​, శీతల్, బీట్​ అధికారులు చిస్తీ, రవీనా, సీతారాం, వసంత, బేస్​ క్యాంపు సిబ్బంది పాల్గొన్నారు.