Breaking Newsజిల్లా వార్తలునల్గొండ
మైనార్టీ మహిళల స్వయం ఉపాధికి ప్రభుత్వం చేయూత..!
మైనార్టీ మహిళలు స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని నకిరేకల్ మార్కెట్ చైర్మన్ గుత్తా మంజుల అన్నారు.

మైనార్టీ మహిళల స్వయం ఉపాధికి ప్రభుత్వం చేయూత..!
BY : RAMMURTHY, KETHEPALLY
మైనార్టీ మహిళలు స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని నకిరేకల్ మార్కెట్ చైర్మన్ గుత్తా మంజుల అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ మహిళలకు స్వయం ఉపాధికై అందించే శుక్రవారం నిర్వహించిన ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహిళా సంక్షేమ పథకాల ను సద్వినియోగం చేసుకొని మహిళలు తమ కుటుంబాల అభివృద్ధికి తోడ్పడాలని ఆమె కోరారు. కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు ఎడ్ల ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మైనార్టీ మహిళలు, తదితరులు పాల్గొన్నారు.









