Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

అద్దంకి, నార్కట్ పల్లి రహదారిపై రోడ్డు ప్రమాదం.. గుర్తు తెలియని వ్యక్తి మృతి..!

అద్దంకి - నార్కట్పల్లి స్టేట్ హైవేపై రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. నల్గొండ జిల్లా నార్కట్పల్లి ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.

అద్దంకి, నార్కట్ పల్లి రహదారిపై రోడ్డు ప్రమాదం.. గుర్తు తెలియని వ్యక్తి మృతి..!

మిర్యాలగూడ, మన సాక్షి :

అద్దంకి – నార్కట్పల్లి స్టేట్ హైవేపై రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. నల్గొండ జిల్లా నార్కట్పల్లి ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం రాత్రి సుమారు 9:15 నిమిషాల సమయంలో నార్కట్పల్లి నుండి అద్దంకి వెళ్ళు ఎస్హెచ్02 రోడ్డు పైన చెరువుగట్టు దేవస్థానం దేవుని పాదాల సమీపంలో ఒక గుర్తు తెలియని మగ వ్యక్తి వయసు సుమారు 65 నుండి 70 సంవత్సరాలు కలిగిన వ్యక్తి మృతి చెందాడు. గుర్తు తెలియని వాహనం టక్కరించి వెళ్ళగా అట్టి వ్యక్తి బలమైన గాయాలయి అక్కడికక్కడే చనిపోయినాడు.

ఇట్టి వ్యక్తి యొక్క కుడి చేయి మీద జి రామారావు అనే టాటూ మరియు రాముని దేవుని యొక్క టాటూ తెలుగుదేశం పార్టీ సింబల్ అయిన ఉదయించే సూర్యుడు నాగలి ఇల్లు గుర్తు కలిగిన టాటూలు కలిగి ఉన్నాడు. తెల్లని జుట్టు తెల్లని గడ్డము చామన చాయ రంగులో ఉన్నాడు. ఇట్టి వ్యక్తి యొక్క ఆచూకీ తెలిసిన వారు నార్కట్పల్లి ఎస్సై కి సమాచారం అందించవలసినదిగా కోరుచున్నాము.
SHO Cell:8712670186, పోలీస్ స్టేషన్ నంబర్ : 9712667735

మరిన్ని వార్తలు