Miryalaguda : ట్రాక్టర్ ను ఢికొన్న డిసీఎం.. రైతు మృతి..!
కోదాడ- జడ్చర్ల జాతీయ రహదారిపై ట్రాక్టర్లు డీసీఎం ఢీకొనడంతో రైతు మృతి చెందాడు. మిర్యాలగూడ రూరల్ ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం..

Miryalaguda : ట్రాక్టర్ ను ఢికొన్న డిసీఎం.. రైతు మృతి..!
మిర్యాలగూడ, మన సాక్షి :
కోదాడ- జడ్చర్ల జాతీయ రహదారిపై ట్రాక్టర్లు డీసీఎం ఢీకొనడంతో రైతు మృతి చెందాడు. మిర్యాలగూడ రూరల్ ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడ-జడ్చర్ల NH 167 రహదారి ఆలగడపలో గురువారం ఉదయం 05.30 గంటలకు మృతుడు కుర్ర చిన్న నాగరాజు (42) తన యొక్క ఐషర్ TS 05 EN 2236 ట్రాక్టర్ ఇంజిన్ కల్టీవేటర్ తో గల దానిని నడుపు కుంటూ ఇంటి నుండి బయలు దేరి మూసి బ్రిడ్జ్ దగ్గర గల తన పొలాన్ని దున్నుతకు వెల్లుతున్నాడు.
వెనుకాల నుండి వెళ్ళుచున్న TG 38 T 0101 నెంబరు గల DCM వాహనం, దానిని నడుపుచున్న డ్రైవరు రంగలి నరేశ్ (ధన్వాడ, నారాయణపేట జిల్లా) వేగంగా, నిర్లక్షముగా నడిపి, మృతుడికి బలంగా టక్కరు ఇవ్వగా, ట్రాక్టర్ ఇంజిన్ రోడ్డు మీదనే బోల్తా పడిపోయింది. రైతు కుర్ర చిన్న నాగరాజు దాని క్రింద పడిపోయి తలకు తీవ్ర గాయాలై చనిపోయినాడు. మృతుడికి, భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె కలరు. మృత్తిడి భార్య సునీత ఇచ్చిన దరఖాస్తు పైన DCM డ్రైవరు పై కేసు నమోదు చేయనైనదని ఎస్ ఐ ఉప్పు నగేష్ తెలిపారు.










