అక్షితని అభినందించిన బిల్యా నాయక్..!
లంక దేశంలో జరిగినటువంటి రెండవ సౌత్ ఏషియన్ పారా త్రో భాల్ చాంపియన్ షిప్ 2026లో ద్వీతియ బహుమతి వెండి పతాకం గెలిచిన దేవరకొండ నియోజకవర్గం చింతపల్లి మండల పరిధిలోని చాకలి షెర్ పల్లి గ్రామానికి చెందిన ఆకుల జగతయ్య, సంతోష కూతురు ఆకుల అక్షిత యాదవ్ ని శుక్రవారం అభినందించి శుభాకాంక్షలు తెలిపిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కేతావత్ బీల్యా నాయక్.

అక్షితని అభినందించిన బిల్యా నాయక్..!
BY : VENKAT, CHINTHAPALLY
చింతపల్లి : శ్రీ లంక దేశంలో జరిగినటువంటి రెండవ సౌత్ ఏషియన్ పారా త్రో భాల్ చాంపియన్ షిప్ 2026లో ద్వీతియ బహుమతి వెండి పతాకం గెలిచిన దేవరకొండ నియోజకవర్గం చింతపల్లి మండల పరిధిలోని చాకలి షెర్ పల్లి గ్రామానికి చెందిన ఆకుల జగతయ్య, సంతోష కూతురు ఆకుల అక్షిత యాదవ్ ని శుక్రవారం అభినందించి శుభాకాంక్షలు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కేతావత్ బీల్యా నాయక్ అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అక్షిత యాదవ్ ఈ పతాకం గెలువడం మండల ప్రజలందరికి, మనందరికి గర్వకారణం అని రానున్న రోజుల్లో మరింత ముందుకు సాగుతూ పుట్టిన ఈ నేలకు, ఈ రాష్ట్రానికి, దేశానికి మంచి కీర్తిప్రతిష్టలు తెవాలని అక్షిత యాదవ్ కి మా ఆశీస్సులు వెళ్ళేప్పుడు ఉంటాయని ఆశీర్వదించారు. అక్షిత యాదవ్ కు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ శ్రీశైలం, ఉప సర్పంచ్ వెంకటేష్, బిఆర్ఎస్ గ్రామ శాఖ ఆకుల శ్రీను, వార్డు సభ్యులు మదుర వెంకటయ్య, గోట్టె పర్వాతాలు, ఉడుతల అభ్భి , శ్రీనివాస్, అప్రోజ్, మల్లన్న, రాజు, ఉడుతల శ్రీను, జైపాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.









