Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండవిద్య

బుద్దవనం సందర్శించిన మిర్యాలగూడ కేంద్రీయ విద్యాలయ విద్యార్థులు

నాగార్జున సాగర్ లోని ప్రముఖ పర్యాటక బౌద్ధ కేంద్రం బుద్ధవనాన్ని శుక్రవారం మిర్యాలగూడ పి ఎమ్ శ్రీ కేంద్రీయ విద్యాలయానికి చెందిన విద్యార్థులు సందర్శించారు. బుద్ధవనం సందర్శనలో భాగంగా బుద్ధవనములోని బుద్ధ చరిత వనం, ధ్యానవనం, స్తూపవనాలను సందర్శించారు.

బుద్దవనం సందర్శించిన మిర్యాలగూడ కేంద్రీయ విద్యాలయ విద్యార్థులు

BY : LAKSHMI VIJAY, NAGARJUNASAGAR 

నాగార్జునసాగర్, మన సాక్షి : నాగార్జున సాగర్ లోని ప్రముఖ పర్యాటక బౌద్ధ కేంద్రం బుద్ధవనాన్ని శుక్రవారం మిర్యాలగూడ పి ఎమ్ శ్రీ కేంద్రీయ విద్యాలయానికి చెందిన విద్యార్థులు సందర్శించారు. బుద్ధవనం సందర్శనలో భాగంగా బుద్ధవనములోని బుద్ధ చరిత వనం, ధ్యానవనం, స్తూపవనాలను సందర్శించారు.

బుద్దవనం సమావేశ మందిరంలో బుద్ధవనం విశేషాలు తెలియజేసే లఘు చిత్రాన్ని వీక్షించిన అనంతరం బుద్ధవనం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శాసన మహాస్తూపంలోని ధ్యాన మందిరంలో విద్యార్థులచే ధ్యానం చేయించారు. వీరికి స్థానిక టూరిజం గైడ్ సత్యనారాయణ నాగార్జునసాగర్,బుద్ధవనం విశేషాలను వివరించారు.

ఈ సందర్భంగా మిర్యాలగూడ కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపాల్ రవి మాట్లాడుతూ ఎడ్యుకేషనల్ టూర్ లో భాగంగా బుద్దవనం సందర్శించే విద్యార్థులకు తెలంగాణ టూరిజం బుద్ధవనం ఎంట్రన్స్ ఫీజులో 50% రాయితీ ఇవ్వడం హర్షనీయమని, ఇటువంటివి ఎడ్యుకేషన్ టూర్లకు ఎంతో ప్రోత్సాహం ఇస్తుందని అన్నారు. వీరితోపాటు కేంద్రీయ విద్యాలయ అధ్యాపక బృందం రవి, దివ్యకాంత్, సతీష్, మోబిన్, షిఖా,అనూష తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు