viralBreaking NewsTOP STORIESజిల్లా వార్తలునల్గొండ

Viral Video : మామని చెప్పుతో చితక్కొట్టిన కోడలు.. వేములపల్లి మండలంలో ఘటన.. (వీడియో వైరల్)

Viral Video : మామని చెప్పుతో చితక్కొట్టిన కోడలు.. వేములపల్లి మండలంలో ఘటన.. (వీడియో వైరల్)

మన సాక్షి, వెబ్ డెస్క్:

మనుషులకు బంధాలు.. అనుబంధాలు లేకుండా పోతున్నాయి. కేవలం రుణానుబంధాలు మాత్రమే మిగులుతున్నాయి. ప్రతి విషయానికి ఆర్థిక సంబంధాలే దాగి ఉంటున్నాయి. తండ్రి, కొడుకుల మధ్య కూడా ఇలాంటి సంబంధాలే ఉంటున్నాయి.

పిల్లలు జన్మించిన తర్వాత వారికి విద్యాబుద్ధులు నేర్పించి, వివాహం చేసి ఆస్తిలో వాటాను సైతం రాసిస్తున్నారు తల్లిదండ్రులు. అయితే ఆస్తిలో వాటా తక్కువైందని మామగారిని చెప్పుతో కొట్టిన కోడలు ఉదంతం నల్గొండ జిల్లా వేములపల్లి మండలంలో చోటుచేసుకుంది. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కన్నతండ్రిలా చూసుకోవలసిన మామ పై కోడలు చెప్పుతో దాడికి దిగితే సమీపంలో ఉన్న కుక్క సైతం అడ్డుకునేందుకు తీవ్ర ప్రయత్నం చేసింది. మూగజీవాలకు ఉన్న మానవత్వం కూడా మనుషుల్లో లేకుండా పోయింది. ఇలాంటి సంఘటనతో మానవత్వం మంట కలిసి పోతుంది. ఐపీఎస్ సీనియర్ అధికారి, ఆర్టీసీ ఎండి వీసీ సజ్జనార్ సైతం ఈ వీడియో పై స్పందించారు.

నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామంలో గక్కినపల్లి బుచ్చిరెడ్డి, లక్ష్మమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిద్దరికీ వివాహమైంది. తనకున్న 9 ఎకరాల భూమిలో ఆరు ఎకరాల భూమిని ఇద్దరి కుమారులకు చెరిసగం పంచిపెట్టాడు. తన వద్ద మూడు ఎకరాల భూమిని జీవనోపాధి కోసం ఉంచుకున్నాడు. అయితే ఇటీవల చిన్న కుమారుడి కొడుకు దినేష్ రెడ్డికి మూడు ఎకరాల భూమిని బుచ్చిరెడ్డి రిజిస్ట్రేషన్ చేయించారు.

ఈ విషయంపై భూ వివాదం ఏర్పడింది. తనకు తక్కువ వాటా ఇచ్చారని పెద్ద కోడలు మణిమాల బుచ్చిరెడ్డి పై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఈ క్రమంలోనే నవంబర్ 20వ తేదీన మామ బుచ్చిరెడ్డి ఇంటి వద్ద వీల్ చైర్ లో కూర్చుని ఉండగా చెప్పుతో విచక్షణరహితంగా దాడికి దిగింది.

అయితే ఈ సమయంలో సమీపంలో ఉన్న కుక్క బుచ్చిరెడ్డి పై దాడిని అడ్డుకునేందుకు తీవ్ర ప్రయత్నం చేసింది. కానీ లాభం లేకుండా పోయింది. ఈ దృశ్యం ఇంటి సమీపంలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయింది. ఆ సీసీ కెమెరాలు రికార్డు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

దీనిపై ఆర్టీసీ ఎండీ సజ్జనర్ స్పందించారు. మానవత్వమా నీ జాడ ఎక్కడ..? మూగజీవాలకు ఉన్న మానవత్వం కూడా మనిషికి లేదా..? ఎటు పోతుంది సమాజం..? ఇలాంటి సమాజంలో మనుగడ సాగిస్తామా అని తలుచుకుంటేనే బాధేస్తుంది. అని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.

VIDEO

MOST READ : 

మరిన్ని వార్తలు