తీవ్ర విషాదం.. ఎస్ఆర్ఎస్పి కాలువలో ముగ్గురు విద్యార్థుల గల్లంతు..!
వరంగల్ జిల్లాలో తీవ్ర విషాద సంఘటన చోటుచేసుకుంది. కే యూ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న ముగ్గురు విద్యార్థులు ఎస్.ఆర్.ఎస్.పి కెనాల్ లో గలంతయ్యారు.

తీవ్ర విషాదం.. ఎస్ఆర్ఎస్పి కాలువలో ముగ్గురు విద్యార్థుల గల్లంతు..!
మన సాక్షి, వెబ్ డెస్క్:
వరంగల్ జిల్లాలో తీవ్ర విషాద సంఘటన చోటుచేసుకుంది. కే యూ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న ముగ్గురు విద్యార్థులు ఎస్.ఆర్.ఎస్.పి కెనాల్ లో గలంతయ్యారు. బీటెక్ చదువుతున్న ముగ్గురు విద్యార్థులు ఈత సరదాకు ఎస్సారెస్పీ కాల్వకు వెళ్లారు. కాలువలో ముగ్గురు విద్యార్థులు ఈత కొట్టేందుకు వెళ్లారు. అనంతరం కాలువలోకి దిగారు. వరద ప్రవాహం అధికంగా ఉండడం.. వారికి ఈత రాకపోవడంతో ముగ్గురు కొట్టుకుపోయారు. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు వారిని కాపాడే ప్రయత్నం చేశారు.
అయినా కూడా ముగ్గురు గల్లంతయ్యారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. విద్యార్థుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన వారిలో ఒక విద్యార్థి మృతదేహం లభించగా మిగిలిన ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కళాశాల యాజమాన్యం బాధిత కుటుంబాలకు విషయం తెలియజేసింది. దాంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు, బంధువులు చేరుకున్నారు.









