Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజగిత్యాల జిల్లాజిల్లా వార్తలుతెలంగాణ

Breaking : లారీ బీభత్సం.. స్పాట్ లో ముగ్గురు మృతి..!

లారీ బీభత్సం సృష్టించడంతో ముగ్గురు వ్యక్తులు మృతి చెందిన సంఘటన జగిత్యాల జిల్లాలోని ధర్మపురి పట్టణంలో జాతీయ రహదారిపై జరిగింది.

Breaking : లారీ బీభత్సం.. స్పాట్ లో ముగ్గురు మృతి..!

మన సాక్షి, వెబ్ డెస్క్:

లారీ బీభత్సం సృష్టించడంతో ముగ్గురు వ్యక్తులు మృతి చెందిన సంఘటన జగిత్యాల జిల్లాలోని ధర్మపురి పట్టణంలో జాతీయ రహదారిపై జరిగింది. వివరాల ప్రకారం బుధవారం అర్ధరాత్రి ధర్మపురి జాతీయ రహదారిపై ఓ లారీ మరో వాహనాన్ని ఓవర్టేక్ చేయబోయింది. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న బైకును ఢీ కొట్టింది. అదేవిధంగా పక్కన వెళుతున్న ఆటోను కూడా ఢీ కొట్టింది.

ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా ఆటోలో ఉన్నవారికి గాయాలయ్యాయి. మృతులంతా ధర్మపురి పట్టణంకు చెందిన వారే ఉన్నారు. క్షతగాత్రులను జగిత్యాల ఆసుపత్రికి తరలించారువ మృతి చెందిన వారిలో అమర్నాథ్, విశ్వంత్ గా గుర్తించారు. మరో వ్యక్తి మయన్ అని తెలుస్తోంది. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. ఈ సంఘటన కారణమైన లారీ డ్రైవర్ పరారైనట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు