Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
ACB : ఏసీబీకి చిక్కిన చండూరు డిప్యూటీ తాసిల్దార్..!

ACB : ఏసీబీకి చిక్కిన చండూరు డిప్యూటీ తాసిల్దార్..!
మన సాక్షి నల్గొండ :
నల్గొండ జిల్లా చండూరు మండల డిప్యూటీ తాసిల్దార్ ఓ రైతు దగ్గర నుంచి 20 వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. గట్టుప్పల్ మండలం తెరట్ పల్లి గ్రామానికి చెందిన అక్రమ రిజిస్ట్రేషన్ పై సమాచార హక్కు చట్టం కింద బాధితులు వివరాలు కోరగా అందుకు గాను డిప్యూటీ తాసిల్దార్ చంద్రశేఖర్ 20వేల రూపాయలు లంచంగా డిమాండ్ చేశారు.
బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. కాగా బాధితుడి సమాచారం మేరకు ఏసీబీ అధికారులు గురువారం రాత్రి హైదరాబాదులోని బాలాపూర్ లో తన నివాసంలో లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.









