Breaking NewsTOP STORIESతెలంగాణహైదరాబాద్

Power Bills : కరెంటు బిల్లుల చెల్లింపులో ఈ నెల నుంచి కష్టాలే.. ఫోన్ పే, గూగుల్ పే యాప్ లతో చెల్లిస్తే అంగీకరించబడవు..!

Power Bills : కరెంటు బిల్లుల చెల్లింపులో ఈ నెల నుంచి కష్టాలే.. ఫోన్ పే, గూగుల్ పే యాప్ లతో చెల్లిస్తే అంగీకరించబడవు..!

హైదరాబాద్, మన సాక్షి :

ఇప్పటివరకు విద్యుత్ వినియోగదారులంతా నెల నెలా విద్యుత్ కార్యాలయాలలో బిల్లులు చెల్లించడం కంటే యూపీఐ యాప్స్ ద్వారానే ఎక్కువగా చెల్లిస్తున్నారు. కానీ టీజీఎస్పీడీసీఎల్ (TGSPDCL) సంచలన ప్రకటన చేసింది. అలా యూపీఐ ద్వారా చెల్లించే విద్యుత్ బిల్లులు అంగీకరించబడవని తెలియజేసింది . తన అఫీషియల్ ఎక్స్ లో ఈ విషయాన్ని పేర్కొన్నది. టిజిఎస్పీడీసీఎల్ ఎక్స్ లో పేర్కొన్న అంశాల్లో..

ఆర్బిఐ (RBI) నిబంధనల ప్రకారం కరెంటు బిల్లులు ఫోన్ పే, పేటియం, గూగుల్ పే, అమెజాన్ పే మరియు బ్యాంకుల ద్వారా చెల్లించిన కరెంట్ బిల్లులను టిజిఎస్పీడీసీఎల్ (TGSPDCL) అంగీకరించబడదని తెలియజేసింది. 2024 జూలై 1వ తేదీ నుంచి ఇది అమలులోకి వస్తుందని పేర్కొన్నది. వినియోగదారులంతా టీజీ ఎస్పీడీసీఎల్ (TGSPDCL) అధికారిక వెబ్సైట్ గాని మొబైల్ యాప్ ద్వారా గాని మాత్రమే ప్రతినెల కరెంటు బిల్లులు చెల్లించాలని పేర్కొన్నది. కరెంటు బిల్లుల చెల్లింపులో పారదర్శకత ఉండేందుకుగాను విద్యుత్ సంస్థలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ALSO READ ; 

NALGONDA : లో వోల్టేజి సమస్యకు చెక్, హైదరాబాద్ తరహాలో నల్గొండ జిల్లాను అభివృద్ధి చేస్తా.. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి..!

Pavan Kalyan : జీతం వద్దు, దానికోసమే పని చేస్తా.. పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం..!

 

 

మరిన్ని వార్తలు