Pavan Kalyan : జీతం వద్దు, దానికోసమే పని చేస్తా.. పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం..!

ఆధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీసుకున్నారు. పిఠాపురంలో ఎన్టీఆర్ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.

Pavan Kalyan : జీతం వద్దు, దానికోసమే పని చేస్తా.. పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం..!

ఆధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీసుకున్నారు. పిఠాపురంలో ఎన్టీఆర్ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. పంచాయతీరాజ్ శాఖలో ఎన్ని వేల కోట్ల అప్పులు ఉన్నాయో తెలియట్లేదని పేర్కొన్నారు. గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత జీతం తీసుకుని పనిచేద్దాం అనుకున్నా.. కానీ శాఖలో డబ్బులు లేకపోవడం, వేలకోట్ల రూపాయల అప్పులు చూసి జీతం తీసుకోకూడదని, ఎమ్మెల్యేగా పని చేద్దామని నిర్ణయించుకున్నట్లు ఆయన వెల్లడించారు.

ALSO READ : Viral : ఒకే ఇంటికి మూడోసారి చోరీకి వెళ్ళిన దొంగ.. బెడ్ రూమ్ లో దంపతులను నగ్నంగా చూసి.. చివరకు ఇలా..!

అప్పుల కారణంగా కార్యాలయంలో మరమ్మతులు కూడా చేయించలేదని, తన కార్యాలయంలో ఫర్నిచర్ కూడా తానే కొనుక్కుంటానని, రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమ కోసమే పని చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. తనవంతుగా పనిచేసి ప్రజల మన్ననలు పొందితేనే తనకి ఆనందం కలుగుతుందని, విజయ యాత్రను చేయడానికి సిద్ధంగా లేనట్టు తెలిపారు. పిఠాపురం నియోజకవర్గం దేశంలోనే అగ్రగామిగా తయారు చేయాలని తన లక్ష్యమని, అందుకు నైపుణ్య శిక్షణ ఇచ్చే యువతలో నైపుణ్యాలను వెలికి తీస్తా, విదేశాలకు వెళ్లి శిక్షణ ఇప్పించి పంపాలన్నారు. డబ్బులు వెనకేసుకోవాలని, కొత్తగా పేరు రావాలని తనకు ఆశ లేదని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.

ALSO READ :

T20 world Cup 2024 : టి20 వరల్డ్ కప్ లో డబ్బే.. డబ్బు.. ప్రైజ్ మనీ ఎంతో తెలిస్తే షాక్..!

BREAKING: తహసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్.. ధరణి ఫైళ్ల తనిఖీ..!